వెంకటేశ్ – వి.వి.వినాయక్ కలయికలో వచ్చిన ‘లక్ష్మి’ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ‘లక్ష్మి’ సినిమాకు కథ అందించిన ఆకుల శివ వెంకటేశ్ కోసం మరో కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వినాయక్ తన మార్క్ మాస్‍తో పాటు కామెడీ, యాక్షన్‍ను మేళవించి ఈ తాజా సినిమా స్క్రిప్ట్ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ‘లక్ష్మి’ని నిర్మించిన నల్లమలుపు బుజ్జి నిర్మాణంలోనే ఈ సినిమా కూడా రానుంది. వెంకటేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, అగ్ర కథానాయకుడు చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’లోనూ వెంకటేశ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
















































































































































































































































Review లక్కీ కాంబో మరోసారి...