వచ్చిందే చేస్తానంటే ఎలా?

నాయికలదీ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరి అభిరుచులు వారివి. అయితే, ఇప్పటి కథానాయికలు ఇదివరకటి మాదిరిగా తమ షూటింగ్‍ పార్ట్లో పాల్గొని.. ఆనక పేకప్‍ చెప్పేసి సైలెంట్‍గా వెళ్లిపోవడం లేదు. తమ మనసులోని ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అవెంతో ఆసక్తికరంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉంటున్నాయి. సాధారణంగా ‘నాకు వచ్చిందే చేస్తాను. ఏది నప్పుతుందో ఆ పాత్రనే ఒప్పుకుంటాను’ అనే మాటలు సినీ పరిశ్రమలో వినిపిస్తుంటాయి. అయితే, రకుల్‍ప్రీత్‍సింగ్‍ మాత్రం అలాంటి ధోరణి ఉంటే ఎలా ఎదుగుతామని అంటోంది. ‘నేనైతే ఏదైనా చేయగలననే ఓ నమ్మకంతో పరిశ్రమలోకి వచ్చాను. ఒక వైట్‍ పేపర్‍లా కెమెరా ముందు అడుగుపెట్టా. నాకు ఎటువంటి పాత్రలు నప్పుతాయనేది దర్శకులకే వదిలిపెట్టా. వాళ్లు సృష్టించిన పాత్రలో వాళ్ల ఆలోచనలకు తగినట్టుగా ఒదిగిపోతుంటా. ఈ ప్రయత్నం, ఆటిట్యూడ్‍ నాకు మంచి ఫలితాలనే ఇచ్చింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్‍ తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది.

Review వచ్చిందే చేస్తానంటే ఎలా?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top