
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర్ హీరోగా ‘గరుడ వేగ’తో హిట్ అందుకున్న ప్రవీణ్.. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితకథతో సినిమా రూపొం దించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకపక్క ప్రవీణ్ ఈ పనుల్లో ఉండ గానే.. ఆయనతో కలిసి తాను పని చేయ బోతున్నట్టు హీరో నితిన్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించాడు. ప్రతిభావంతుడైన ప్రవీణ్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లో సినిమా చేయనున్నట్టు తెలిపాడు. ప్రవీణ్ సత్తారు ఇప్పటి వరకు ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’, ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’ వంటి డిఫరెంట్ సినిమాలను తెర కెక్కించాడు.
Review వరుస విజయాల ‘ప్రవీణుడు’.