
ఫిదా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. వరుసగా తెలుగులో అందరి హీరోలతో సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈమె శర్వానంద్‌తో జతకట్టనుంది. వీరిద్దరు జంటగా హను రాఘవపూడి దర్శ కత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్క పల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీ కరిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడని టాక్. అతని పాత్ర, లుక్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు.
Review శర్వానంద్‌తో సాయిపల్లవి.