సంక్రాంతికా? వేసవికా?

ప్రభాస్‍ హీరోగా, నాగ్‍అశ్విన్‍ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి.’. వైజయంతీ మూవీస్‍ పతాకంపై అశ్వనీదత్‍ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని గతంలోనే చిత్ర యూనిట్‍ ప్రకటించింది. అయితే, ఇప్పుడీ సినిమా 2024, వేసవికి థియేటర్లలో సందడి చేయనుందని అంటున్నారు. ఈ సినిమా విడుదలపై నాగ్‍ అశ్విన్‍ మాట్లాడుతూ, ‘గ్రహాలు, నక్షత్రాలు ఎలా అనుకూలిస్తాయో చూడాలి. అప్పుడే మాకు విడుదల తేదీపై స్పష్టత వస్తుంది’ అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూస్తారని, మునుపెన్నడూ చూడని ప్రభాస్‍ను ఈ సైన్స్ ఫిక్షన్‍ మూవీలో చూస్తారని ఆయన చెబుతున్నాడు. చూద్దాం!

Review సంక్రాంతికా? వేసవికా?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top