‘మహానటి’లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేశ్ ఈ సినిమా చేశాక తాను సావిత్రికి ఫాన్ అయిపోయానని చెబుతోంది. అంతేకాదు తామిద్దరికీ పోలికలు కూడా ఉన్నాయని అంటోంది. అవేమిటంటే- తనకు ఈత కొట్టడం అంటే మహా ఇష్టమట. క్రికెట్, కార్లు అన్నా పిచ్చి అట. సావిత్రికి కూడా సరిగ్గా ఇవంటేనే ఇష్టాలని ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ద్వారా తెలిశాక అబ్బురమని అనిపించిందని కీర్తి చెబుతోంది. ఈ పోలికలు కలవడం వల్లే తాను ఆమె పాత్రను పోషించగలిగానేమోనని అంటోంది. సావిత్రి వ్యక్తిత్వం గురించి తన తల్లి ద్వారా తెలుసుకున్నాక ఆమెపై అభిమానం, గౌరవం రెట్టింపు అయ్యాయని, ఆమె అభిమాని అయిన తన తల్లి తాను పోషించిన పాత్ర ద్వారా ఎంతో సంతోషం పొందుతోందని చెప్పుకొచ్చింది. తనకు ఈ కెరీర్‍లో ఇదే అతి పెద్ద బహుమతి అని ముక్తాయింపునిచ్చింది.
సావిత్రితో తనకు పోలికలు ఉన్నాయట

Review సావిత్రితో తనకు పోలికలు ఉన్నాయట.