
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ తరువాత తీయబోయే చిత్రం ఖరారైంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ విడుదల చేశారు. భారతీయ సినీ పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన అగ్రగణ్యులైన నటులు ఇందులో నటించబోతున్నారు. ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్, నయనతార, కన్నడ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి హేమాహేమీలు ఇందులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెర పంచుకోనున్నారు. రాయలసీమకు చెందిన తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నాడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఏఆర్ రహమాన్ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. స్టైలిష్ దర్శకుడిగా పేరొందిన సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ఈ సినిమాకు నిర్మాత. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Review ‘సైరా’ చిరంజీవ.