విలువలతో బతకడమే ఆధ్యాత్మికత..
విలువలతో బతకడమే ఆధ్యాత్మికత..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ఆధునిక ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలుస్తోంది. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడమే అభివృద్ధి, నాగరికత కాదు. మనిషిగా మనం నాణ్యతగా జీవించే తీరు, మనం కనబరిచే విలువలే ఆ దేశపు ఔన్నత్యాన్ని పెంపొందించే సాధనాలు. ఇవి అల వడాలంటే, బతుకుల్లో నాణ్యత పెరగాలంటే ప్రతి మనిషి ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి. మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి ఆధ్యాత్మికత దోహదపడుతుంది. తెలుగు పత్రికలో వివిధ ఆధ్యాత్మిక అంశాలతో పాటు తెలుగు బాష – సంస్క•తి, సంప్రదాయాలు, ఆచారాల గురించి అందిస్తున్న వివరాలు చదివిస్తున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక గురువులు, వివిధ పీఠాల స్వామీజీల గురించి కూడా వీలుని బట్టి వివరాలు అందించడానికి ప్రయత్నించండి.
– మురళి- హైదరాబాద్, క్రిష్.పి.- టెక్సాస్, అరవింద, తులసి, కామేశ్, పి.సి.సుగుణాకరరావు, కె.ప్రతాప్, రాగసుధ, లక్ష్మణకుమార్, గిరిప్రసాద్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
హిందూ దేవాలయాలు
క్రితం సారి సంచికలో అందించిన అమెరికాలోని హిందూ దేవాలయం గురించిన వివరాలు చది వించాయి. ఇంకా అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న హిందూ దేవాలయాల గురించి వరుసగా ఇవ్వండి. వీటి నిర్మాణానికి జరిగిన ప్రయత్నాలు, కృషి చేసిన వ్యక్తుల గురించి తెలియచెబితే బాగుంటుంది. విదేశాల్లో మన హిందూ ధర్మం పరిఢవిల్లడం ఎంతైనా ఆనందదాయకం. కాబట్టి ఇటువంటి వాటిని ప్రపంచానికంతటికీ తెలియ చెప్పాల్సిన అవసరం పత్రికలపైనే ఉంది. ఆ బాధ్యతను తెలుగు పత్రిక సమర్థవంతంగా నిర్వర్తించాలి.
– కిషన్‍రావు, బీ.వెంకటప్రసాద్, సి.రాజ్‍కుమార్- హైదరాబాద్, రామచంద్రరావు- విజయవాడ, రవికిరణ్, రఘు ప్రసాద్, వెంకటేశ్వర్లు మరికొందరు (ఈ-మెయిల్ ద్వారా)
యాత్రా దర్శనం
‘తెలుగుపత్రిక’లో అందిస్తున్న వివిధ శీర్షికలు బాగుంటున్నాయి. పుణ్యక్షేత్రాల దర్శిని వంటి శీర్షికను కూడా అందిస్తే బాగుంటుంది. ఎవరైనా వివిధ పుణ్య క్షేత్రాలను దర్శిస్తే.. ఆ క్షేత్రం గురించి వారి మాట ల్లోనే ఆ అనుభూతిని, అనుభవాలను చెప్పించడం వల్ల మిగతా వారికి ఆసక్తి కలుగుతుంది. అటువంటి శీర్షికలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించండి.
– ఆర్.శంకర్, జయంతి శ్రీరామ్, కవిత మరికొందరు.
Review ఉత్తరాయణం.