
నవ వసంతం
వసంత మాస విశేషాలు.. ఉగాది పర్వదిన ప్రత్యేకతలు.. శ్రీరామ నవమి సంగతులతో ఏప్రిల్ 2022 తెలుగుపత్రిక సంచిక అలరించింది. సంవత్సరాది వేళ మనో వికాసం కలిగించేలా కవర్‍స్టోరీ అందించారు. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మంచి నడవడికను ఎలా అవర్చుకోవాలో బాగా వివరించారు
– ఆర్.వెంకటేశ్వరరావు, కేఎన్ నాగరాజు, కొత్తకోట శ్రీనివాస్- హైదరాబాద్, సి.విశేష్, సీఆర్ నాగేశ్వరవర్మ, ప్రభాకర్, సీహెచ్. కోదండరామారావు మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
చైత్ర మాస విశేషాలు
తెలుగు పత్రిక ఏప్రిల్ సంచికలోని మాసం – విశేషం శీర్షిక కింద చైత్ర మాసం గురించి అందించిన వివరాలు బాగున్నాయి. చైత్ర మాసంలో వచ్చే ప్రతి తిథిని కవర్ చేస్తూ దానికి సంబంధించిన నేపధ్యాన్ని చక్కగా వివరించారు.
– మహేంద్రనాథ్-విజయవాడ, కనిగిరి ప్రసాద్,
శ్రీపాద్- తిరుపతి, ఆర్.అలేఖ్య, పి.ప్రసాదరావు- హైదరాబాద్
నవరత్నాలు
నవరత్నాలను జ్యోతిషరీత్యానే కాదు.. ఆరోగ్యరీత్యా కూడా వాడొచ్చని ఆరోగ్య భాగ్యం శీర్షికలో అందించిన వివరాలు చదివించాయి. మన ప్రాచీన ఆయుర్వేద ఘనతకు ఇది నిదర్శనం.
– కె.కిశోర్, హైదరాబాద్
Review ఉత్తరాయణం.