నవరస నటతిలక

నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీ నటుడు మోహన్‍బాబుకు ‘కళాబంధు’ టీ.సుబ్బరామిరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ‘నవరస నటతిలకం’ బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలంతా హాజరయ్యారు. ఆంధప్రదేశ్‍లోని విశాఖపట్నంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మోహన్‍బాబుకు బిరుదుతో పాటు స్వర్ణకంకణం తొడిగారు. ఈ సందర్భంగా ‘మోహన్‍బాబు నట ప్రస్తానం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.

రామ్‍కు పదేళ్లు

తెలుగు హీరో రామ్‍ తన సినీ కెరీర్‍లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తాజా సినిమా ‘హైపర్‍’ అక్టోబరు 30న విడు దలైంది. ఎనర్జిటిక్‍ స్టార్‍గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‍ తాజాగా కిషోర్‍ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

వాట్సాప్‍ ‘విద్య’

మలయాళీ ముద్దుగుమ్మ విద్యాబాలన్‍ ‘డర్టీపిక్చర్‍’తో గ్లామరస్‍ నటనతో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హ•మ్లీ హీరోయిన్‍గా పేరున్న ఈమె ఇటీవల డెంగ్యూ వ్యాధి బారిన పడింది. ఇపు•డిప్పుడే కోలుకుంటున్న ఆమె సెల్‍ఫోన్‍లోని వాట్సాప్‍ ద్వారా తన మాతృభాష మలయాళం నేర్చుకుంటోంది. మలయాళ కవయిత్రి కమలాదాస్‍ జీవిత చరిత్రతో రూపొందనున్న మలయాళ చిత్రంలో విద్యాబాలన్‍ టైటిల్‍రోల్‍ పోషించనుంది. బాలన్‍ పుట్టింది కేరళలో అయినా విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది. దీంతో

నిద్ర లేకుండా చేసేవాడు

దర్శకుడు రాజమౌళి, యువ నటుడు జూనియర్‍ ఎన్టీఆర్‍ (తారక్‍) సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళిని తారక్‍ ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుస్తాడు. అంటే, తాను రూపొందించే సినిమాలను అంత తదేక దీక్షతో తీర్చిదిద్దుతాడని అలా పిలుస్తాడు. అసలు విషయానికి వస్తే.. దర్శకునిగా రాజమౌళి పదిహేనేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎడిటింగ్‍ అసిస్టెంట్‍గా కెరియర్‍ ప్రారంభించిన రాజమౌళి మొత్తం సినీ పరిశ్రమలో ఇరవై అయిదేళ్ల ప్రస్థానాన్ని.. దర్శకుడిగా పదిహేనేళ్ల ప్రస్థానాన్ని

రాజకీయాల్లోకి మహేశ్‍!

తెలుగు నాట సినిమాలకు రాజకీయాలకు అవినాభావసంబంధం ఉంది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి.. ఆపై రాజకీయాల్లో మెరుపులా మెరిసిన వారు తెలుగు చిత్రసీమలో ఎందరో.. ఈ కోవలో మొదట నిలిచే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన సినిమాల్లో, రాజకీయాల్లో తెలుగునాట చెరగని ముద్ర వేశారు. ఆ తరువాత ఎందరో సినీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. మెగాస్టార్‍ చిరంజీవి కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మహేశ్‍బాబు పేరు

Top