గరుత్మంతుడు
సృష్టిలో ప్రతి జీవికి స్వేచ్ఛను అనుభవించే హక్కును భగవంతుడు ప్రసాదించాడు. తమకు, తమ వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కలిగినపుడు దానిని పరిరక్షించుకోవడం ధీరుల లక్షణం. మన పురాణాల్లోని గరుత్మంతుడు కూడా తనకు తన తల్లికి స్వేచ్ఛ కావాలని పోరాడి గెలిచిన ధైర్యవంతుడు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య వినత కొడుకు గరుత్మంతుడు. తండ్రి తపశ్శక్తి కారణంగా పుట్టుకతోనే మహా బలవంతుడు. ఇక కద్రువకు పాములే సంతానం. సహజ వైరులైన