చీమ..చిలక..పాయసం
అనగా అనగా ఒక చీమా, ఒక చిలుకా ఉండేవి. ఈ ఇద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్లిద్దరికీ పాయసం వండుకుని తినాలనే బుద్ధి పుట్టింది. చీమ వెళ్లి బియ్యపు నూకలూ, పంచదారా తెచ్చింది. చిలుక పోయి కట్టెపుల్లలూ, చట్టీ, నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారయింది. అయితే చీమకు మహా తొందర. అది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది.