అన్నం తిందాం రండి.. అరిటాకు వెయ్యండి
అరిటాకులో భోజనం.. చివరిసారిగా ఎప్పుడు చేశారో గుర్తుచేసుకోండి!. గుర్తులేదు కదూ! అవును. అరిటాకులో అన్నం తినడం మనమెప్పుడో మరిచిపోయాం. మరి, కార్తీక మాసం వస్తోంది. కనీసం ఈ సందర్భాన్ని పురస్కరించుకునైనా అరిటాకులో తిందాం!. కార్తీకం.. ఆధ్యాత్మిక మాసం. ఉదయాన్నే చన్నీటి స్నానాలు.. ఉపవాసాలు.. దీపారాధనలు.. దానాలూ వ్రతాలూ.. ఇవన్నీ ఒకెత్తయితే ఇంటిల్లిపాదీ, బంధుమిత్ర జనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా విందారగించే సందర్భమూ కార్తీకంలోనే వస్తుంది. అవే- వన భోజనాలు. కార్తీక మాసం




