ఈ నెలలోనే ‘తాత వస్తాడు..’

కమల్‍హాసన్‍, శంకర్‍ కాంబోలో వస్తున్న ‘భారతీయుడు2’ ఈ ఏడాది జూలై 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవలే ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. అనిరుద్‍ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కమల్‍-శంకర్‍ కాంబినేషన్‍లో వచ్చిన భారతీయుడు ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి.

నాలుగు గెటప్పుల ‘మట్కా’

వరుణ్‍తేజ్‍ తొలి పాన్‍ ఇండియా మూవీ- ‘మట్కా’. కరుణకుమార్‍ దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్‍ ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్సిటీలో ఇందుకోసం భారీ సెట్‍ను నిర్మించారు. 1958-82 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా విశాఖపట్నం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ పీరియాడికల్‍ యాక్షన్‍ థ్రిల్లర్‍లో వరుణ్‍తేజ్‍ నాలుగు భిన్న గెటప్‍ల్లో కనిపించనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ

సరికొత్త పాత్రల ‘కుబేర’

ధనుష్‍, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్‍ కమ్ముల రూపొందిస్తున్న పాన్‍ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్‍ ఇటీవలే హైదరాబాద్‍లో ప్రారంభమైంది. ఇందుకోసం భారీ సెట్‍ను వేశారు. ఇందులో ధనుష్‍, నాగార్జునతో పాటు మిగిలిన తారాగణంపై భారీ యాక్షన్‍ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన సోషల్‍ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్‍, నాగ్‍ సరికొత్త పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‍ సంగీతం అందిస్తున్నారు.

అక్టోబర్‍లో ‘గేమ్‍ చేంజర్‍’

రామ్‍చరణ్‍ తన ‘గేమ్‍ చేంజర్‍’ను ముగించేందుకు సిద్ధమవుతున్నారు. శంకర్‍ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ పాన్‍ ఇండియా సినిమాను దిల్‍రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథాయిక. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్‍ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే కొత్త షెడ్యూల్‍ మొదలైంది. రాజమండ్రి, హైదరాబాద్‍లో జరిగే ఈ షెడ్యూల్‍తో చిత్రీకరణ పూర్తి కానుందని సమాచారం. దీపావళి కానుకగా అక్టోబరు చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ధర్మానిదే విజయం

ఆంధప్రదేశ్‍ శాసనసభ, లోక్‍సభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‍కల్యాణ్‍ వంద శాతం స్ట్రైక్‍ రేట్‍తో విజయకేతనం ఎగురవేశారు. ఆయన పార్టీ సాధించిన ఘన విజయం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ మంచి జోష్‍ నింపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్‍కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఓజీ’ చిత్ర బృందం కొత్త పోస్టర్‍ను విడుదల చేసింది. అందులో పవన్‍ చలువ కళ్లద్దాలు పెట్టుకుని, స్టైలిష్‍గా కుర్చీలో కూర్చుని కనిపించారు.

Top