నాన్న కోసం..

ఇదేదో కొత్త సినిమా టైటిల్‍ అనుకోకండి. ఆ మధ్య రెండు మూడు తెలుగు సినిమాల్లో తళుక్కుమన్న రాధికా ఆప్టే తాజాగా చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ‘ప్యాడ్‍మాన్‍’, ‘ఫార్స్డ్‍’, ‘బద్లాపూర్‍’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ తన తండ్రి కోసం నిర్మాతగానూ మారబోతోంది. వైద్యుడిగా తన తండ్రి ప్రయాణాన్ని తెరకెక్కించాలని ఎన్నాళ్లుగానో అనుకుంటోందట. రాధికా ఆప్టే తల్లి దండ్రులు ఇద్దరూ వైద్యులే. తన

రాణా మళ్లీ రణం చేసేనా

యువ నటుడు రానా దగ్గుబాటికి యుద్ధాలు బాగా అచ్చివచ్చినట్టున్నాయి. ‘బాహుబలి’లో, ఆ తరువాత వచ్చిన ‘ఘాజీ’లో రానా నేలపై, నీళ్లలో యుద్ధాలు చేసేశాడు. తాజాగా ‘1945’ అనే చిత్రంలో కూడా ఆయన కళ్లు చెదిరే యుద్ధ సన్నివేశాల్లో నటించనున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్పై ఉంది. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని, భారత్‍ - పాక్‍ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటు న్నారు. వీరిద్దరి కాంబి

అరవింద సమేత… వీరరాఘ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ నటిస్తున్న సినిమాకు ‘అసామాన్యుడు’, ‘సింహనంద’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే ‘అరవింద సమేత - వీరరాఘవ’ అనే టైటిల్‍ను ధృవీకరించారు. ఇక, ఈ చిత్రంలో ఎన్టీఆర్‍ చిత్తూరు యాసలో డైలాగులు చెప్పనున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన పెంచల దాసు (‘కృష్ణార్జున యుద్ధం’లో ‘దారి చూడు మామా’ అనే గీతాన్ని రాసి, పాడిన కళాకారుడు) ఎన్టీఆర్‍కు

సావిత్రితో తనకు పోలికలు ఉన్నాయట

‘మహానటి’లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేశ్‍ ఈ సినిమా చేశాక తాను సావిత్రికి ఫాన్‍ అయిపోయానని చెబుతోంది. అంతేకాదు తామిద్దరికీ పోలికలు కూడా ఉన్నాయని అంటోంది. అవేమిటంటే- తనకు ఈత కొట్టడం అంటే మహా ఇష్టమట. క్రికెట్‍, కార్లు అన్నా పిచ్చి అట. సావిత్రికి కూడా సరిగ్గా ఇవంటేనే ఇష్టాలని ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ద్వారా తెలిశాక అబ్బురమని అనిపించిందని కీర్తి చెబుతోంది. ఈ పోలికలు కలవడం వల్లే

అంతరిక్షం’లో ఇద్దరు అమ్మాయిలతో..

వరుణ్‍తేజ్‍ అంతరిక్ష కథాంశంతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా అంతరిక్షంలో ‘ఆకర్షణ’ చాలా తక్కువగా ఉంటుంది. ఆస్ట్రోనాట్‍లు కూడా ‘ఆకర్షణ’కు అంతే తక్కువగా ఉంటారు. అయితే, ఈ వరుణ్‍తేజ్‍ ఆస్ట్రోనాట్‍ మాత్రం ఆకర్షణ బలం గట్టిగా ఉన్నోడే. అందుకే కాబోలు ఈ చిత్రంలో అతని సరసన ఇద్దరు కథానాయికలను ఎంపిక చేశారు. ఈ ఆస్ట్రోనాట్‍ చివరకు ఎవరి ఆకర్షణకు గురయ్యాడనేది తెరపై చూడాల్సిందే. ‘ఘాజీ’ చిత్రంలో అందరి దృష్టిని

Top