పలుకు తేనెల తల్లి!
సిరి దేవత లక్ష్మీదేవి గురించి తెలుసుకునే ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. భారత యుద్ధం ముగిసింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పరుండి అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలా ప్రాణాలను నిలుపుకోవాలనే తలంపుతో ఉన్నాడు. కృష్ణుడు, ధర్మరాజు తదితరులు ఆయన వద్ద విచార వదనాలతో నిల్చున్నారు. అక్కడ రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. ‘ధర్మనందనా! భీష్ముడు రాజనీతిజ్ఞుడు. లోకం పోకడ తెలిసిన మనిషి. సకల ధర్మాలూ తెలిసిన