ఊరికో క్రాంతి.. సంబరాల సంక్రాంతి
భారతీయ సంప్రదాయంలో సామూహికంగా నిర్వహించుకునే పండుగలు, పర్వాలు ఎన్ని ఉన్నా సంక్రాంతి సంబరాలకు మాత్రం మరేదీ సాటి రాదు. ‘జనమంతా మనవాళ్లే.. ఊరంతా మన ఇల్లే’ అన్నట్టుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకుంటారు. ఎన్ని పనులున్నా ఎలాగైనా తీరిక చేసుకుని ఊరికి వెళ్లడం.. మూడు రోజుల పాటు బంధుమిత్రులతో సరదాగా గడపడం.. ఈ సందర్భంగా మమతానుబంధాలను పెంపొందించుకోవడం అనేది ఒక్క సంక్రాంతితోనే సాధ్యం. భోగిమంటలు, అందమైన ముగ్గులు, పిండివంటలు.. గంగిరెద్దుల ఆటలు.. హరిదాసు కీర్తనలు..