Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

ఆనందం నిండుగా… సంక్రాంతి పండు
వచ్చిందయా వచ్చింది - ఉల్లాసంగా సంక్రాంతి
తెచ్చిందయ్యా తెచ్చింది - తెలుగు వాకిట సుఖశాంతి
గణగణ గంటల నాదంతో - గలగల గజ్జెల రావంతో
కిలకిల కిలకిల నవ్వులతో - గరిసెలు నిండగా రాసులతో
డూడూ డూడూ వెంకన్నా - గంగిరెద్దుల బసవన్నా
తూతూ తూతూ పాటలతో - కిన్నెర సన్నాయి పాటలతో..
మన జీవితాల్లో ఆధునిక నాగరికత ప్రభావంతో అధునాతన జీవన విధానాలు చోటుచేసుకుంటున్నా.. ఈ కారణంగా మన తెలుగింటి సంప్రదాయాలు కొన్ని కనుమరుగైపోతున్నా.. సంక్రాంతి శోభ మాత్రం మన పట్టుగొమ్మలైన పల్లెలను ఇంకా అంటిపెట్టుకునే ఉంది.
మన జీవితాల్లో, ముఖ్యంగా మన తెలుగు వారి సంప్రదాయాల్లో సంక్రాంతిది విశిష్ట స్థానం.
సంక్రాంతి అంటే ప్రకృతితో మమేకమైన భారతీయ జీవితానికి ప్రతీక..
మట్టి మనుషుల (రైతుల) జీవితాల్లో ఉషస్సులు నింపే సంబరాలకు వేదిక..
బతుకుబాటలో మనతో కలిసి నడిచే మూగజీవులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఇదో సందర్భోచితమైన వేడుక..
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు పల్లెల అందమే వేరుగా ఉంటుంది.
నేలంతా రంగవల్లుల, విరిజల్లుల హరివిల్లు పరుచుకుంటుంది.
మూడు రోజుల పండుగతో అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నిండుతాయి. జీవన విధానాల్లో చోటుచేసుకున్న మార్పులతో నాటి ఉమ్మడి కుటుంబాలు వేరుపడ్డాయి.
బతుకుదెరువుకు తలోచోటుకు వెళ్లడం తప్పనిసరైంది.
ఉద్యోగాలు, చదువులు, ఇతరత్రా పనుల నిమిత్తం పల్లె జనం నగరాలకు, పట్టణాలకు మకాం మార్చింది.
అటువంటి కుటుంబాలన్నీ చలో పల్లె‘టూరు’కు క్యూ కట్టేది సంక్రాంతి సందర్భంగానే..
ఇలా చేరిన అందరితో సంక్రాంతికి పల్లెల్లో సందడి అంబరాన్ని తాకుతుంది. ఏ పండుగ పరమార్థమైనా.. మనిషికి సుఖసంతోషాలను చేకూర్చడమే అంతరార్థమై ఉంటుంది. అటువంటి ఆనందాలను, సంతోషాలను నిండుగా అందించే పండుగ సంక్రాంతి.
భోగి మంటల వెలుగులు, పెద్ద పండుగ దీవెనలు,
ముక్కనుమ సంబరాలు అందరి జీవితాల్లో
సంక్రాంతులు పూయించాలని కోరుకుంటూ.

ఆధ్యాత్మిక ‘మార్గం‘
ఆంగ్ల మానం ప్రకారం జనవరి కొత్త సంవత్సరం. ఇది ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో మొదటి మాసం. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి.. పుష్య మాసం. అలాగే మార్గశిర మాస తిథులు కూడా కొన్ని కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో పుష్యమి తొమ్మిదవ మాసం. ఈ మాసంలో 13వ తేదీ వరకు మార్గశిర మాస తిథులు, ఆపై పుష్య మాస తిథులు కొనసాగుతాయి. జనవరి 14 నుంచి పుష్య మాసం ఆరంభమవుతుంది. తెలుగు సంప్రదాయంలోనే అతి పెద్ద పర్వమైన సంక్రాంతి, విశిష్టమైన వైకుంఠ ఏకాదశి వంటి పండుగలకు ఈ మాసం నెలవు.
2021- జనవరి 1, శుక్రవారం, మార్గశిర బహుళ విదియ నుంచి
2021- జనవరి 31, ఆదివారం, పుష్య బహుళ తదియ వరకు..
శ్రీశార్వరి నామ సంవత్సరం- మార్గశిరం - పుష్యం- హేమంత రుతువు- ఉత్తరాయణ
పుడమిని సస్యశ్యామలం చేసే మాసం- పుష్యం. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం కాబట్టి పుష్య మాసం అయ్యింది. ‘పుష్య’ అనే పదానికి పోషణ శక్తి కలిగినది అని అర్థం. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాలకు, వేదాధ్యయనానికి అనువైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని పండితులు చెబుతారు. పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యేందుకు అవకాశం కల్పించేది కూడా ఈ మాసమే. పుష్య మాసంలోనే పంటలు చేతికి అందిన సంతోషంతో రైతులు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర
పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు. వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యాన్ని కలుగచేస్తుంది. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి

ఉత్తరాయణ
గోవిందా...
తెలుగు పత్రిక డిసెంబర్ సంచికలో అందించిన భజగోవిందం తెలుగు తాత్పర్య సహిత ముఖచిత్ర కథనం చాలా బాగుంది. భజ గోవిందం శ్లోకాలలో ఇమిడి ఉన్న జీవిత పరమార్థం గురించి చదివితే ఆశ్చర్యం అనిపించింది. ఇవి కేవలం శ్లోకాలే అనుకున్నాం కానీ, వాటిలో దాగి ఉన్న అంతరార్థం గురించి చదివితే ఎంతో చక్కని అనుభూతి కలిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వంటి వారు ఇటువంటి శ్లోకరాజాలతో మన భారతీయ సంప్రదాయాన్ని, జీవిత పరమార్థాన్ని గురించి అత్యద్భుతంగా నాడే చెప్పడం విశేషం. మన సంప్రదాయాలు ఎంత పురాతనమైనవో అర్థమైంది
- కె.సత్యబాబు, ఆర్.కిశోర్, రాజబాబు, రవికుమార్, జి.ఆంజనేయులు, మరికొందరు ఆన్లైన్ పాఠకు
సామెతలు
సామెతల వెనుక దాగి ఉన్న అంతరార్థాలను విశ్లేషిస్తున్న తీరు బాగుంది. మరుగైపోయిన సామెతలను నేటి తరానికి పరిచయం చేస్తున్నందుకు అభినందన
- బీ.ఆర్.రాంప్రసాద్- హైదరాబాద్, కమల్, శ్రీకాంత్- తిరుపతి
తిథి సహితం..
ఆయా పండుగలను తిథి, వార, తేదీ సహితంగా అందిస్తున్న మాసం విశేషం శీర్షిక తెలుగు పత్రిక మొత్తానికే హైలైట్.
- కమలకుమారి, తిరుపతి

పుష్య మాసం శని మాసం
ఈ మాసంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని.. మానవ శరీర జీవనాడి కారకుడు. జీవనాడి యొక్క ఒకశాఖ హృదయ స్పందనను, రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి, శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గడం వల్ల మకర మాసం మొదలయ్యే సమయానికే ఈ కొవ్వు కొరతను తీర్చాలని నియమం. ఇందువల్ల రవి ప్రభావం (ఎండ వేడిమి) ఎదుర్కోవడానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చేయడం వల్ల హృదయ స్పందన సక్రమంగా ఉండేటట్టు చేయగల ‘నువ్వులు - బెల్లం’ తినాలనే నియమం పెట్టారు.
శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించే వాడు అతడే. భక్తులు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్టలు పాటిస్తే శని తన ధర్మాలన్నిటినీ ప్రసాదిస్తాడు. మనిషి ఎప్పుడైతే న్యాయం, సత్యం, ధర్మం వంటి శుభ లక్షణాలను పొందగలమో అప్పుడే అతను బృహస్పతి (గురువు) అంతటి వాడవుతాడు.
పుష్యమి నక్షత్రం శని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి (గురువు). శనికి అధి దేవత యముడు. ‘యమం’ అంటే, ‘సం యమం’ అని అర్థం. అంటే ఆధీనంలో ఉంచుకోవడం. అంటే, శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవడం ఈ జీవనాడి మూలంగా మాత్రమే సాధ్యం. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్థం తక్కువైతే శరీరం చైతన్యం కోల్పోవడం, అనారోగ్యం మొదలైనవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి నువ్వులు, బెల్లానికి మాత్రమే ఉంది.
ఇక, పుష్యమాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాల గురించి తెలుసుకుందాం..
మార్గశిర బహుళ విదియ/ ఆంగ్ల నూతన సంవత్సరం : జనవరి 1, శుక్రవారం
మార్గశిర బహుళ విదియ తిథి నాటి నుంచి ఆంగ్లమానం ప్రకారం కొత్త సంవత్సర ఆరంభ దినం. పాశ్చాత్య సంస్క•తి ప్రభావంతో ఈనాడు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
మార్గశిర బహుళ తది : జనవరి 2, శనివారం
సాధారణంగా తదియ తిథి అక్షయాలను ప్రసాదించాలని కోరుతూ లక్ష్మీదేవిని పూజించడానికి అనువైనది.
మార్గశిర బహుళ చతుర్థి : జనవరి 3, ఆదివారం
చతుర్థి తిథి వినాయక పూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా చతుర్థి నాడు సంకష్ట హర చతుర్థి పూజలు నిర్వహిస్తారు.
మార్గశిర బహుళ పంచమి : జనవరి 4, సోమవారం
పంచమి తిథి నాగుల పూజకు ఉద్ధిష్టమైనది.
మార్గశిర బహుళ సప్తమి/ ఫల సప్తమీ వ్రతం : జనవరి 5, మంగళవారం
మార్గశిర బహుళ సప్తమి తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మార్గశిర బహుళ అష్టమి/ కాలాష్టమి : జనవరి 6, బుధవారం
మార్గశిర బహుళ అష్టమి నాడు కాలాష్టమి వ్రతాన్ని, పూజల్ని చేస్తారు. అష్టమి తిథి నాడు కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఇంకా ఈ తిథి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని అంటారు.
మార్గశిర బహుళ నవమి/రూపా నవమి : జనవరి 7, గురువారం
మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమీ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మార్గశిర బహుళ ఏకాదశి/సఫలైకాదశి : జనవరి 9, శనివారం
మార్గశిర బహుళ ఏకాదశికే ‘సఫలైకాదశి’ అని కూడా పేరు. తెలిసీ, తెలియక ఉపవాసం ఉంటే చాలు.. ఈనాడు తగిన ఫలాన్ని పొందుతారని ప్రతీతి. అందుకు నిదర్శనంగా నిలిచే కథ కూడా ఒకటి ఉంది. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కొడుకు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతనలా తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఇదంతా తనకు తెలియకుండానే మార్గశిర కృష్ణ ఏకాదశి నాడు జరిగింది. అయినా, లుంపకుడు ఆ వ్రతం యొక్క ఫలితాన్ని పొందగలిగాడు.
అందుచేత ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది.
మార్గశిర బహుళ ద్వాదశి/ప్రదోష వ్రతం : జనవరి 10, ఆదివారం
మార్గశిర బహుళ ద్వాదశి.. మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశిగా ప్రసిద్ధి. ఈనాడు ఈ రెండు వ్రతాలు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరించే సంప్రదాయం ఉంది. ఈనాటి నుంచే ఉత్తరాషాఢ కార్తె ఆరంభమవుతుంది.
మార్గశిర బహుళ త్రయోదశి/యమ దర్శన : జనవరి 11, సోమవారం
మార్గశిర బహుళ త్రయోదశి తిథిని గురించి చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో యమ దర్శన త్రయోదశిగా వర్ణించారు. ఈనాడు యముడిని విశేషంగా పూజించాలి.
మార్గశిర బహుళ చతుర్దశి/మాస శివరాత్రి : జనవరి 12, మంగళవారం
సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రి తిథి. ఈనాడు శివుడికి తగినరీతిలో పూజించాలి. కాగా, ఈనాడు జాతీయ యువజన దినోత్సవం. స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ రోజు యువత దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
మార్గశిర బహుళ అమావాస్య/ భోగి : జనవరి 13, బుధవారం
మార్గశిర బహుళ అమావాస్య గురించి.. మహోదధ్యమావాస్య అని గదాధర పద్ధతి
అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇంకా దీనినే బకులామావాస్య అనీ అంటారు. పాలతో పాయసం వండి నివేదించడాన్నే ‘బకులక్షీరేణపాసంకృత్యా’ అంటారు. ఈనాడే సంక్రాంతి మూడు రోజుల పర్వంలోని తొలి రోజు అయిన భోగి పండుగ.
పుష్య శుద్ధ పాడ్యమి/మకర సంక్రాంతి : జనవరి 14, గురువారం
పుష్య శుద్ధ పాడ్యమి పుష్య మాసపు ఆరంభ దినం. ఈనాడే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరగతుడవుతాడు. ఈనాటి నుంచి ఉత్తరాయణ దినాలు ఆరంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు మకర సంక్రాంతి పర్వాని ఘనంగా జరుపుకుంటారు.
పుష్య శుద్ధ విదియ/కనుమ : జనవరి 15, శుక్రవారం
పుష్య శుద్ధ విదియ సంక్రాంతి పర్వంలోని మూడో పర్వమైన కనుమ దినం. ఈనాడు పశుపూజలు విశేషంగా జరుగుతాయి. ఈనాటి నుంచి గురుమౌఢ్యమి ఆరంభమవుతుంది. ఇదిలా ఉండగా, ఈనాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నాలుగు రోజుల పాటు సాగే విష్ణు వ్రతాన్ని కూడా ఈనాడే మొదలుపెట్టాలని అంటారు.
పుష్య శుద్ధ తదియ : జనవరి 16, శనివారం
సంక్రాంతి పర్వం ఈనాటితో ముగుస్తుంది. దీనినే ముక్కాల పండుగ అనీ అంటారు.
పుష్య శుద్ధ పంచమి/నాగపూజ : జనవరి 18, సోమవారం
పుష్య శుద్ధ పంచమి నాడు చతుర్ధీ వ్రతం ఆచరించాలని వ్రత నియమం. మధుసూదన భగవానుడిని ఈనాడు పూజించాలి.
మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఆచారమై ఉంది
పుష్య శుద్ధ షష్ఠి/ కుమారషష్ఠి : జనవరి 19, మంగళవారం
పుష్య శుద్ధ షష్ఠిని కుమారషష్ఠి అని అంటారు. కుమారషష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం ఆచరణ తమిళులలో ఎక్కువగా కనిపిస్తుంది. అరవ వారిలో పలువురికి కుమారస్వామి ఇలవేల్పు. వారిలో ఆర్మొగమ్, షణ్ముగన్, కుమరన్ మున్నగు పేర్లు ఎక్కువగా ఉంటాయి. ప్రాచీనాంధ్ర కవులు తమ కావ్యాలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ ఆంధ్ర దేశంలో హెచ్చుగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు తెలుగునాట నేటికీ నిలిచి ఉన్నాయి. దీనివల్ల ఒకప్పుడు ఇక్కడ కూడా కుమారస్వామి ఉత్క•ష్ట స్థాయిలో పూజలందుకున్నాడని తెలియ వస్తోంది. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేష పూజలందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే
మార్గశిర శుద్ధ షష్ఠి తెలుగు నాట పెద్ద పర్వమే. ఇక, ఇదే మాదిరిగా తమిళులు జరుపుకునే పండుగ-పుష్య శుద్ధ షష్ఠి.
పుష్య శుద్ధ సప్తమి : జనవరి 20, బుధవారం
పుష్య శుద్ధ సప్తమి నాడు మార్తాండ సప్తమిగా ప్రతీతి. అలాగే ఈనాడు ద్వాదశ సప్తమి వ్రతం కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. వీటి పేర్లను బట్టి పరిశీలిస్తే.. ఇవి సూర్య సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. ఈనాడు సూర్య భగవానుడిని యథాశక్తి పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే ఈ అష్టమిని బుద్ధ అష్టమిగానూ ఆచరిస్తారు.
పుష్య శుద్ధ నవమి : జనవరి 22, శుక్రవారం
పుష్య శుద్ధ నవమి నాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేసి మహామాయను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటించాలి.
పుష్య శుద్ధ దశమి : జనవరి 23, శనివారం
పుష్య శుద్ధ నవమి చాలా విధాలుగా ప్రతీతమై ఉంది. వివిధ వ్రత గ్రంథాలు దీనిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ అని అర్థం. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు. కాగా, భారత జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి దినం ఈనాడే.
పుష్య శుద్ధ ఏకాదశి : జనవరి 24, ఆదివారం
రైవతుడు అనే పేరు వచ్చింది. ఈయన రేవతి, దుర్దముల కొడుకు. ఇతను కాలక్రమేణ ధర్మవేది అయి మనువు అయ్యాడు. అతని మన్వంతరంలో విభుడు అనేవాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్థ్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్తరుషులు.
పుష్య శుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినమే కాక పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది.
సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
పుష్య శుద్ధ ద్వాదశి : జనవరి 25, సోమవారం
పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి, సుజన్మ ద్వాదశీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడే భారత గణతంత్ర దినోత్సవం.
పుష్య శుద్ధ చ్రతుర్దశి
జనవరి 27, బుధవారం
పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఇది విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేసి, గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు.
పుష్య శుద్ధ పౌర్ణమి : జనవరి 28, గురువారం
పుష్య నక్షత్రంతో కూడిన పున్నమికి ‘పౌషీ’ అని పేరు. ఏ మాసంలో పూర్ణిమావాస్య వస్తుందో ఆ మాసానికి పుష్యమాసమని పేరు. శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి.
పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి.
మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి. మనకు వచ్చే పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. దీనికి ‘అనుమతి’ అని పేరు. పదహారు కళలలో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. దీనికి ‘రాకా పూర్ణిమ’ అని పేరు. అనుమతి అయితేనేం, రాకా అయినేతేం.. మొత్తానికి మనకు ఏడాదికి పన్నెండు పూర్ణిమలు. ఈ పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా ఉన్నాయి.
హిందువుల పండుగలను పరిశీలిస్తే.. కృష్ణ పక్షంలో కంటే శుక్ల పక్షంలో పండుగలు ఎక్కువ. ఆస్వాదనీయమైన శుక్ల పక్షపు వెన్నెల వ్యర్థం కాకుండా మన పెద్దలు ఆ రోజుల్లో పండుగలు, పబ్బాలు, వ్రతాలు, ఉత్సవాలు ఏర్పాటు చేసి ఉంటారు. అందుకే తెలుగు నాట ‘పున్నమి’ గొప్ప తిథి.
మానవ ప్రపంచం ప్రచురించిన మహనీయులలో సాటిలేని మేటి గౌతమబుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రముఖ స్థానాన్ని వహించింది. ఆయన పుట్టింది ఒక వైశాఖ పూర్ణిమ నాడైతే, ఆయన బుద్ధుడిగా అవతరించింది మరో వైశాఖ పూర్ణిమ నాడు. నిర్యాణం చెందినది మరో వైశాఖ పూర్ణిమ నాడు.
ఇక, దశావతారాల్లో ఒకటైన కూర్మావతారపు జయంతి వైశాఖ పూర్ణిమ నాడు. హనుమజ్జయంతి చైత్ర పూర్ణిమ నాడు. జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా ప్రసిద్ధి. శ్రావణ పూర్ణిమ రక్షా పూర్ణిమ.
భాద్రపద పూర్ణిమలు అధ్యాయ, ఉపాకర్మ పూర్ణిమలు. ఆశ్వయుజ పూర్ణిమ కోజాగరీ పూర్ణిమ. కార్తీక పూర్ణిమ త్రిపుర పూర్ణిమ. మార్గశిర పూర్ణిమ కోరల పున్మమ. పుష్య పూర్ణిముత్సర్జనోత్సవ పూర్ణిమ. మాఘ పూర్ణిమ మహా మాఘి పూర్ణిమ. ఫాల్గుణ పూర్ణిమ కాముని పున్నమి.
ఇక, మహా పౌషి (పుష్య పూర్ణిమ) విషయానికి వస్తే.. తమిళులు దీనిని ‘పూసమ్’ అంటారు. తై పూసమ్ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్వేణిలో తామ్రపర్ణి నదిలో
స్నానం పాపక్షయకరమై ఉంటుంది. అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది.
పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది. పుష్య శుద్ధ పూర్ణిమినే హిమశోధన పూర్ణిమ అని కూడా అంటారు
పుష్య బహుళ పాడ్యమి : జనవరి 29, శుక్రవారం
పుష్య కృష్ణ పాడ్యమి నాడు విద్యావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు.
పుష్య బహుళ తదియ : జనవరి 31, ఆదివారం
పుష్య కృష్ణ తదియ నాడు సంకష్ట హరి చతుర్థి వ్రతం ఆచరిస్తారు. గణనాథుడు ఈనాడు పూజలందుకునే దైవం.

ఊరంతా సంక్రాంతి నేలంతా పూబంతి
మన పంటలు ఇంటికి వచ్చే వేళ.. ముంగిళ్లలో పాడి పొంగిపొరలే వేళ.. గంగిరెద్దులు, జానపదులు ఆడిపాడే వేళ.. లిప్తపాటు కాలంలో ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ మహా పుణ్యకాలానికి నాంది పలుకుతాడు. దీంతో ప్రజలు ఈ సంక్రమణ కాలమనే సంక్రాంతి పండుగను తీయతీయగా చేసుకునేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా మన పల్లెల్లో నెలకొనే పండుగ వాతావరణం కమనీయం. ఈ వేడుకలకు అంతటికీ మూల కారణం సూర్యుడే. కాబట్టి ఇది సూర్యదేవుడి పరంగా జరిగే పెద్ద పండుగగా భావిస్తారు. సంక్రాంతి అనే మాటకు సంక్రమించడం అనే అర్థముంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక్కో నెల ఒక్కో రాశిలోకి సూర్యుడు సంక్రమిస్తాడు. ఇలా ప్రతి నెలా మనకు సంక్రాంతి వస్తూనే ఉంటుంది. ఇలా ఏడాదిలో వచ్చే పన్నెండు సంక్రాంతుల్లోనూ ముఖ్యమైనది మకరరాశిలోకి సూర్యుడు సంక్రమించే సమయం. అదే మకర సంక్రాంతి
ఒక సూర్యుడు సమస్త జీవులకు దానొక్కడై తోచు.. అన్నాడు పోతనామాత్యుడు. సమస్త ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. భిన్న జాతులకు, మతాలకు విభిన్నమైన దేవుళ్లు ఉండవచ్చు. కానీ, అందరికీ ప్రత్యక్ష దైవం మాత్రం సూర్యుడే. సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకుని అనుసరించే కాలగణన పద్ధతే.. ‘సౌరమానం’
మూడింధాలుగా..
సూర్యగమనం మూడు విధాలు.
అవి- మంద, శీఘ్ర, సమగతులు.
ఉత్తరాయణ కాలంలో సూర్యుడు ఆరోహణ క్రమంలో ఉంటాడు కాబట్టి గతి మాంద్యం పొందుతాడు. అంటే నిదానంగా కదులుతాడన్న మాట. వృషభం మొదలుకుని కన్యా రాశి వరకు గల ఐదు రాశులలో సంచరిస్తున్నప్పుడు పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది.
దక్షిణాయనంలో సూర్యుడు అవరోహణ క్రమంలో ఉంటాడు కాబట్టి గమనం వేగంగా సాగుతుంది. దీనివల్ల వృశ్చికం నుంచి మీనం వరకు గల ఐదు రాశుల్లో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగటి పూట నిడివి తగ్గుతుంది. రాత్రిళ్లు దీర్ఘంగా ఉంటాయి.
విషవత్లలో మాత్రం సూర్యుడు సమగతిలో ఉంటాడు. విషవత్లంటే రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు. ఇవి సాధారణంగా మార్చి 21, సెప్టెంబర్ 23 నాడు వస్తాయి.
సంక్రమణం అంటే.
ఇలా కదిలే క్రమంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణ కాలం చాలా సూక్ష్మంగా ఉంటుంది.
మనిషి కనురెప్ప కదిలించడానికి పట్టే కాలంలో 30వ భాగానికి ‘తత్పర’ అని పేరు. తత్పరలో వందో వంతును ‘తృటి’ అంటారు. ఆ తృటిలో వందో వంతు కాలంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయాన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
మూడు రోజుల పండుగ ముచ్చట
భోగిభాగ్యాలు
జనవరి 13, 2021 ధనుర్మాసంలో నెల రోజులూ రోజుకు ఒక్క పాశురం చొప్పున రచించిన గోదాదేవి.. శ్రీరంగనాథుడిని వివాహమాడిన రోజు భోగి. ఒక భక్తురాలు భగవంతుడిని వివాహమాడటానికి మించిన భోగమేముంది? భాగ్యమేముంది? ఒక భక్తురాలు అలాంటి భోగాన్ని పొందిన రోజును భోగి పండుగగా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, శ్రీమహావిష్ణువు అర్చన నిర్వహిస్తారు. ఆ సాయంత్రం పిల్లలకు తల్లులు తలలపై రేగిపండ్లను భోగిపండ్లుగా వేస్తారు
సంక్రాంతి
జనవరి 14, 2021
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మకర మాసం. ఆ నెలలో మొదటి రోజు మకర సంక్రాంతి అవుతుంది. నాటి నుంచి సూర్యుడు ఉత్తరదిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అందువలన నాడు సూర్య దేవతారాధన, పితృదేవతల పేరుతో కూష్మాండ దానం చేయాలని పెద్దలు చెబుతారు
కనుమ
జనవరి 15, 2021
ఇది మూడో రోజు పండుగ. ఇది పశు సంతతిని గౌరవించే రోజు. మనది వ్యావసాయక దేశం. పాడికి, పంటకు, అభివృద్ధికీ మూలకారణమైన గోవులను, ఎద్దులను పూజించడం మన సంస్క•తిలో భాగం. అలా పూజించి గోసంతతి దీవెనలు అందుకునే పండుగ కనుమ. ముక్కనుమ నాడు కూడా ఇలాగే పూజిస్తారు.
అత్యంత సూక్ష్మంగా ఉండే ఈ కాలాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. అందువల్లే సంక్రమణానికి ముందు పదహారు, తరువాత పదహారు ఘడియలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ ఘడియల్లోనే సంక్రాంతి సంబరాలను చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది
ఆరు నెలలకోసారి మారే సూర్య గమన
సూర్య గమనం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఆరు నెలలు, దక్షిణంగా ఆరు నెలలు అక్షాంశాలను బట్టి మారుతూ ఉంటుంది. కర్కాటక రేఖ మన దేశంలోని వింధ్య పర్వతాల మీదుగా వెళుతుంది. కర్కాటక సంక్రమణంతో దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలం పితృ దేవతలకు ప్రీతికరమైనది. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర అక్షాంశంలోసంచరించే ఆరు నెలలు ఉత్తరాయణం. ఇది దేవతలకు అత్యంత ఇష్టమైన కాలమని అంటారు. ఆధ్యాత్మికంగా, జ్యోతిషశాస్త్ర రీత్యా ఇది అద్భుతమైన రోజు. అందుకే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు మహాభారత యుద్ధంలో క్షతగాత్రుడై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్యపై ఎదురు చూస్తూ మాఘ శుద్ధ అష్టమి నాడు తనువు చాలించాడు
ఉత్తరాయణ పుణ్యకాల
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’.. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు ప్రాత:కాలానికి చైతన్యం కలిగిస్తున్నాడు. మానవజాతికి, పశుపక్ష్యాదులకు, చెట్లకు అమృతతత్వాన్నిచ్చే జీవనదాత. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్షాల పెరుగుదలకు, జీవకణాల వృద్ధికి కారణం అవుతున్న ఆయనను సృష్టి కార్యక్రమ నిర్మాత అనవచ్చు. దేవతలకు మకర సంక్రమణంతో రోజు ప్రారంభమవుతుందని చెబుతారు. అందుకే మకర సంక్రాంతి నాడు చేసే దాన, జప, తర్పణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తారు. ఉపనయనం వంటి శుభకార్యాలను ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తారు
సంక్రాంతంటే సందడే సందడి
సంక్రాంతి పండుగ నెల రోజులూ తెలుగు పల్లెసీమల్లో సందడే సందడి. ధనుర్మాసం ప్రవేశించగానే సంక్రాంతి కోలాహలం మొదలవుతుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, పూల అలంకరణలతో పల్లెల్లో ప్రకృతికి నిత్యారాధన చేస్తారు. మకర సంక్రమణం సమయంలో రథం ముగ్గులతో తీర్చిదిద్దడం పెద్దలకు పుణ్యలోకాల మార్గాలను సుగమం చేయడమేనని అంటారు. మన పండుగల్లో ఎప్పుడూ ఒక పరమార్థం ఉంటుంది. దేవీ దేవతలను ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవడం, పితృదేవతలను స్మరించుకోవడం అటు భౌతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఉన్నత భావాలకు నిదర్శనాలు. సంక్రాంతి నాటికి అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇంటికి చేరతాయి. ఆ సమయంలో దానధర్మాలకు వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో హరిదాసులు, గంగిరెద్దుల వారు, జంగమ దేవరలు.. ఇలా ఎందరో జానపద కళాకారులు మన ఇంటి ముంగిళ్లకే వస్తారు. మనం ఇచ్చే కానుకలు అందుకుంటారు. ఒకప్పుడు వస్తుమార్పిడికి సంక్రాంతి సమయం ఆలవాలంగా ఉండేది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండివంటల తయారీ, పిల్లలకు భోగిపళ్ల అభిషేకాలు, పిడకలు దండకట్టడాలతో ప్రతి ఇంటా ఎంతో సందడి. నిజంగా ప్రతి గ్రామం ఈ పండుగ రోజుల్లో ఓ సౌభాగ్యసీమగా మారుతుందడనడంలో సందేహం లేదు. సూర్యుడు సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. సర్వజీవులనూ అనుగ్రహించే ఆ దివ్యమూర్తి అరాధన అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే సంక్రాంతి ఓ పండుగ కాదు.. అదో సదాచారం. ప్రత్యక్ష నారాయణుడికి జోతలర్పించడం తెలుగు వారిమైన మన ఘన సంస్కతికి నిదర్శనం
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
January 18, 2021
సూర్యోదయం: 06:50:35
సూర్యాస్తమయం: 18:02:31
చంద్రోదయం: 10:35:42
తిథి: పంచమీ 09:14:12
నక్షత్రం: పూర్వాభాద్ర 07:43:19
యోగం: పరిధ 18:26:55
సూర్యరాశి: మకర
చంద్రరాశి: మీన01:16:09
రాహుకాలం: 08:14:35-09:38:34
యమగండం: 11:02:33-12:26:33
దుర్ముహుర్తం: 12:48:57-13:33:44
వర్జ్యం: 18:11:57-19:56:44
అమృతకాలం: 23:40:35-30:25:22

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia