పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక చలికంఠము చలి చలి చలి చలి చందాయమ్మ గొంగళి కప్పుకో గానాయమ్మ వడ వడ వడ వడ వణికేనమ్మ చలిమంటకు చితుకులు తేవమ్మ (పిల్లలు చలికి వణుకుతూ కంఠము (మెడ) చుట్టూ దుప్పటిని మడత పెట్టి రెండు మూడు చుట్లు

ఆశ్వయుజం..ఆధ్యాత్మికం

తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం అక్టోబరు మాసం ఆశ్వయుజ - కార్తీక మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది పదవ నెల. ఈ మాసంలోని అక్టోబరు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆశ్వయుజ మాస తిథులు. అక్టోబరు 26 నుంచి కార్తీక మాసం ఆరంభమవుతుంది. అటు దేవీ శరన్నవరాత్రుల శోభ.. ఇటు కార్తీక దీప కాంతులతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది. బతుకమ్మ పండుగ, విజయదశమి,

ఉత్తరాయణం

టీచర్స్ డే తెలుగు పత్రిక సెప్టెంబరు సంచికలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల ప్రాముఖ్యత, విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి పాత్ర గురించి చాలా బాగా వివరించారు. ఈ ముఖచిత్ర కథనం చాలా ఇన్‍స్పైరింగ్‍ కలిగించేదిగా ఉంది. అంతేకాకుండా, ‘జీవితంలో మనకు ఎదురుయ్యే ప్రతి వ్యక్తి తన అనుభవాలు చెబుతారు.. వారు కూడా ఉపాధ్యాయులే’ అంటూ సూత్రీకరించడం బాగుంది. - నందేశ్వరరావు- విజయవాడ, వెంకటపతి; విష్ణు, జయశంకర్‍- హైదరాబాద్‍ పండుగల ప్రత్యేకం సెప్టెంబరు మాసంలో వచ్చిన వరుస

మనలోని దీపం!

ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగిస్తాం. అలాగే, జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి మనకు మనమే జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే, మనకు మనం కృషి చేసి ఆయా కష్టాల నుంచి గట్టెక్కాలి. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని ప్రయత్నపూర్వకంగా మనమే దూరం చేసుకోవాలి. కష్టాలకు కంగారు పడకుండా ధైర్యజ్యోతులను నింపుకుని కష్టాలకు స్వస్తి పలకాలి. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూనే సాటి మనిషి కష్టంలో ఒక

విజయవాకిట..ఆదిశంకరుల ఆధ్యాత్మిక బావుటా

మనం విజయవాడగా పిలిచే ఇంద్రకీలాద్రి పర్వతంపైకి ఎన్నోసార్లు వెళ్లి ఉంటాం. అక్కడ కొలువైన కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుని ఉంటాం. కానీ, ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా?.. వీటి గురించి మీకు తెలుసా? దసరా (అక్టోబరు 24/25) సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి మనకు తెలియని కొన్ని సంగతులు తెలుసుకుందాం. ఇంద్రకీల పర్వతంపై కనకదుర్గ అమ్మవారు బంగారు పసిడి వర్ణంతో మేలి మెరుపుతో ప్రకాశిస్తుంటారు. ఈ కారణంగానే ఇంద్రకీలాద్రికి కనకాచలమనే మరో పేరు

Top