మనకు ఏడాదికి ఎన్ని నవరాత్రులు?

శరన్నవరాత్రులని అంటారు. ఇవి ఆశ్వయుజంలో వస్తాయి. మరి ఉగాదికి కూడా వసంత నవరాత్రులంటారు. ఇంకా ఇలాంటి నవరాత్రులు ఏడాదిలో ఎన్నిసార్లు వస్తాయి? ఎన్ని ఉన్నాయి? వసంత నవరాత్రుల ప్రాముఖ్యం ఏమిటి? రుతువులను అనుసరించి మనకు ప్రతి సంవత్సరం ఐదు నవరాత్రులు వస్తాయి. ఈ ఐదు నవరాత్రులు అమ్మవారి (శక్తి) ఆరాధనకు సంబంధించినవే. వీటిలో దేవీ శరన్నవరాత్రులు (దసరా), వసంత నవరాత్రులు ముఖ్యమైనవి. వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వస్తాయి. సంవత్సరాది (ఉగాది)

ఒక్కో ఉగాదికి ఒక్కో పేరెందుకు?

మనం ఏ సంవత్సరంలో పుట్టామో చెప్పగలం. కానీ, ఏ నామ సంవత్సరంలో పుట్టామో ఠక్కున చెప్పలేం. ఎందుకంటే మనకు తెలుగు సంవత్సరాల పేర్లు సరిగా తెలియకపోడమే కారణం. ఇక, సంవత్సరాల పేర్ల నేపథ్యంలోకి వెళ్తే.. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. అందుకే ఈ తిథి నాడే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. ఉగ, ఆది అనే పదాల సమ్మేళనమే ఉగాది. అంటే కొత్త శకం లేదా కొత్త సంవత్సరం

ఆధ్యాత్మిక వికాస పురుషుడు

శ్రీరాముడంటే ఎవరు? సకల సద్గుణాల మూర్తి. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం. నిష్పక్షపాతి. తల్లిదండ్రులంటే అమిత గౌరవం గలవాడు. ప్రజలంటే అంతకుమించిన అభిమానం. రాజుకే కాదు.. ఒక మనిషికి ఎలాంటి లక్షణాలుండాలో అవన్నీ పోతపోసినట్టు మూర్తీభవించిన రూపం- శ్రీరామచంద్రుడు. అందుకే ఈ జానకీ నాయకుడు జగదానంద కారకుడయ్యాడు. జగమంతటికీ నాయకుడయ్యాడు. ఈ నేల మీద కేవలం మనిషిగా జీవిస్తూనే రాముడు ఎన్నో అద్భుత కార్యాలు సాధించాడు. ఆయనెప్పుడూ తాను దేవుడినని చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. కష్టనష్టాలను అనుభవించాడు. చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించాడు.

చిన్న చేప పెద్ద చేపను మింగిందట!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. అశోకుని రాజ్యంలో పశువైతే మాత్రమేమి? పశుజన్మ కంటే

చైత్రమా.. స్వాగతం

ఆంగ్లమానం ప్రకారం ఏప్రిల్‍ నెల సంవత్సరంలో నాలుగో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ - చైత్ర మాసాల తిథుల కలయిక. చైత్ర మాసం తెలుగు సంవత్సరాల లెక్కలో మొదటిది. ఈ మాసంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. సంవత్సరాది దినం. వసంత మాసం చైత్రం నుంచే ఆరంభమవుతుంది. ఏప్రిల్‍ నెలలో ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు, చైత్ర మాసంలోని మరికొన్ని రోజులు కలుస్తాయి. ఏప్రిల్‍ 1,

Top