వరాలనీయవే..వరలక్ష్మి!
‘వ్రతం’ అంటే ప్రవర్తన. మంచి నడవడిక కలిగి వారందరూ ఒకచోట చేరి, ఒక సత్కార్యం చేసినపుడు, ఒంటరిగా చేసిన దానికన్నా కలిసి చేసిన దాని ఫలితం అధికంగా ఉంటుంది. కనుకనే పూజలు, వ్రతాలను సామూహికంగా చేయాలంటారు. అలా చేస్తే వచ్చే ఫలితం అందరికీ సమానంగా అందుతుంది. భగవంతుడి పూజకు తారతమ్యాలు అడ్డురావు. వరలక్ష్మీ పూజలలోని విశిష్టత ఇదే. ‘వర’ అంటే శ్రేష్ఠమైనది అని అర్థం. అష్టలక్ష్ములు ఇచ్చే ఫలాన్ని అనుగ్రహించే