మహా పుణ్యం.. మాఘ స్నానం

మాఘ మాసంలో చేసే స్నానాలు మహా పుణ్యప్రదమైనవి. ఈ మాసంలో ప్రతిరోజూ నియమ నిష్టలతో స్నానాలు చేయడం, వ్రతాలు ఆచరించడం ఆచారంగా ఉంది. వీటినే మాఘ ప్నానాలు, మాఘ వ్రతాలు అని అంటారు. ప్రతిరోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ శ్రవణం (వినడం) కానీ చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మాఘ మాసంలో చేసే వ్రతాలు.. మాఘ మాసంలో చేసే స్నానాలు.. వాటి

యుధిష్టరుడి ధర్మనిరతి

అరణ్యవాసంలో పాండవులు ద్వైతవనంలో గడుపుతున్నారు. ధర్మరాజు తమ్ములతో కలసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున అక్కడకు వచ్చాడు. ‘ధర్మరాజా! నా అరణిని ఒక చెట్టు కొమ్మల్లో దాచుకున్నాను. ఒక మాయదారి జింక వచ్చి ఆ చెట్టు కొమ్మలను అందుకుంది. నేను అరణిని దాచుకున్న కొమ్మ దాని కొమ్మల్లో చిక్కుకుపోయింది. అరణి లేకుంటే నాకు నిత్య విధులు సాగవు. దయచేసి నా అరణిని నాకు అందించు’ అని ప్రాథేయపడ్డాడు. ‘కంగారు

వృద్ధుని తీర్పు

అనగనగా ఒక ఊళ్లో రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజున వాళ్లిద్దరు ఒక దూర ప్రయాణానికి బయల్దేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా బండ్లు, కార్లు, రైళ్లు ఉండేవి కావు కదా! అందుచేత ఇద్దరూ కాలినడక బయల్దేరారు. తోవలో తిందామని రాము మూడు రొట్టెలు, సోము అయిదు రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్లిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున కూర్చుని రొట్టెలు తిందామని

ఈ శివుడు.. రోగనాశకుడు

సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఇక్కడి శివుడిని రోగనాశకుడిగానూ కొలుస్తారు. అక్కడి వేడినీళ్ల కుంటలో స్నానం చేస్తే శరీరం ఆరోగ్యవంతం అవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రలో గల ఉన్కేశ్వర్‍ ఆలయం. శ్రీరాముడు వనవాస కాలంలో ఉన్కేశ్వర్‍ ప్రాంతంలో సీతా సమేతంగా నివాసం ఉన్నాడట. ఆ సమయంలోనే భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట.

వీణాపాణి.. విమల సరస్వతి

వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. అదే శ్రీపంచమిగా ప్రసిద్ధి. అక్షర సంపద అంతటినీ లోక కల్యాణానికి వినియోగించడమే సరస్వతీ దేవికి అసలైన సమర్పణ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లటి వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో పూజించి చందనం, క్షీరాన్నం, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదించాలని శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పినట్టు దేవీ భాగవతంలో ఉంది. విద్యార్థులు సరస్వతిని

Top