దీపారాధన..అంతరార్థం

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపారాధనతోనే ఆరంభం అవుతుంది. అలాగే పూజా కార్యక్రమం కూడా ముందుగా దీపారాధనతోనే ప్రారంభమవుతుంది. దీపారాధన అంటే ప్రమిదలో నూనె, వత్తి వేసి వెలిగించేదని అర్థం. దీపం వెలిగించాలంటే అగ్ని కావాలి. అగ్ని ఘర్షణ ద్వారానే పుడుతుంది. పూర్వకాలంలో యాగాది క్రతువులలో హోమాగ్నిని జ్వలింప చేయడానికి ‘ఆరణి’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించే వారు. ఈ ఆరణిలో రెండు చెక్క గిన్నెలాంటివి పొడవాటి కొయ్యకు అనుసంధానించి ఉంటాయి. మధ్య

దుర్వ్యసనాల ఫలితం

ఇది శ్రీమద్భాగవతంలోని కథ. అల్లరి నల్లనయ్య చిన్ని కృష్ణుడు అమ్మ మీద కినుకబూని దధిభాండము (పెరుగు కుండ)ను పగులగొట్టాడు. పొరుగింట్లో దూరి రోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టి మీదునున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న బాలకృష్ణుడిని చూసి యశోద, ‘కన్నయ్యా! నువ్వింత వరకూ ఎవరికీ చిక్కలేదని, ఎవరూ నీ ముద్దుమోము చూసి నిన్ను శిక్షించలేదని బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు.

శ్రీరాముడి వినయం

శ్రీమద్రామయణంలోని కథ. పరమాత్ముడైన శ్రీరాముడు అమిత పరాక్రమశాలి. మహావీరుడు. ధనుర్విద్యా నిపుణుడు. శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన వశిష్ట మహర్షి వద్ద సకల శాస్త్రములను, ధనుర్విద్యను అభ్యసించాడు. గాయత్రీ మంతద్రష్ట అయిన విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల, అతిబలాది విద్యలు, మరెన్నో అతి రహస్యములైన అస్త్రాలను గురించి నేర్చుకున్నాడు. ఈ అస్త్రాలు కేవలం విశ్వామిత్రుడికి మాత్రమే తెలుసు. ఇదిగాక, పరమ పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముడికి దివ్య ధనువు, అక్షయ తూణీరము, రత్నఖచిత

తృణావర్తుడు

శ్రీగర్గ భాగవతంలోని కథ. ఒకనాడు ముద్దుకృష్ణుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆడిస్తోంది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రాక్షసుడు పెద్ద సుడిగాలి రూపంలో అక్కడకు వచ్చి చుట్టుముట్టాడు. ఉన్నట్టుండి కొండంత బరువెక్కిన చిన్ని కృష్ణుడి భారం భరించలేక యశోద అతడిని నేలపైకి దించింది. జంతువులు, ప్రజలు, ఇంటి పై కప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగిరిపోసాగాయి. ధూళి రేగగా, శ్రీకృష్ణుడు యశోదకు, గోపికలకు కనిపించలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని కోసం

విష్ణుచిత్తుని అతిథిసేవ

శ్రీకృష్ణదేవరాయల విరచిత ‘అముక్తమాల్యద’లోనిదీ కథ. అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం. పాండ్య దేశంలో శ్రీవల్లిపుత్తూరు అనే భవ్య నగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో, హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో, బాతులకు ఆశ్రయమైన కాలువలతో, ఉద్యానవనాలతో, మామిడి, అరటి మొదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. నాలుగు వర్ణస్థులు సుఖశాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని, చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీమన్నారు

Top