కచుడి విద్యాదీక్ష

ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీదకు మనసు పోనివ్వకుండా చదివితే మంచి ఫలితాలు సాధించగలమని ఈ కథ ద్వారా మహాభారతం చేస్తోన్న హితబోధ ఇది. ఇక, కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం నాటి మాట! కశ్యపుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు. ఈ అన్నదమ్ములు (రాక్షసులు, దేవతలు) నిరంతరం

పసివాడి ప్రజ్ఞ

మహా భారతంలోని అరణ్యపర్వంలోనిది ఈ కథ. విదేహ రాజ్యాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు. ఎంతటి మహా విద్వాంసుడైనా వందితో వాదించి గెలవలేకపోతున్నారు. అందరినీ తన పాండిత్యంతో ఓడిస్తున్న వంది ఒకనాడు, ‘నాతో వాదించి ఓడిన వారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’ అని మిక్కిలి అహంకారంతో ప్రకటించాడు. అలా ఎందరినో తన విద్వత్తుతో వివిధ అంశాలలో ఓడించి, వారిని నదిలోకి తోయించి గర్వంతో మిడిసి పడేవాడు. ఆ రోజులలో ఉద్ధాలకుడి

సుందోపసుందులు

ఇద్దరు తమలో తాము పోట్లాడుకుని ఇద్దరూ నాశనం కావడాన్ని ‘సుందోప సుందుల న్యాయం’ అంటారు. ఈనాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహా నగరాలలో కూడా భారతదేశ సంస్కారం కలిగిన వారు ఈ సామెతను వాడుతుంటారు. ఎవరైనా ఇద్దరు వివేకం మరిచి పోట్లాడుకుంటుంటే, వారిని సుందోపసుందుల్లా కొట్టుకుంటున్నారని అనడం కద్దు. ఈ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు చెప్పింది. ఒకనాడు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. తన వద్దకు అతిథులుగా వచ్చిన వారి నుంచి

ప్రళయ కాలం

అది వైకుంఠం. శ్రీమన్నారాయణుడు, శ్రీలక్ష్మీదేవి ఏవో ముచ్చట్లలో మునిగిపోయి ఉన్నారు. అంతలో విష్ణువు, ‘లక్ష్మీ! మా బావ శివుడిని, నా చెల్లి పార్వతిని పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు, ఒక ముఖ్య విషయం వారితో చర్చించాలని అనుకుంటున్నాను. గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించాడు. ‘నాథా! గరుత్మంతుడు అనంతనాగునితో ముచ్చట్లాడుతున్నాడు. ఇప్పుడే పిలుస్తానుండండి’ అని బదులిచ్చింది లక్ష్మి. ‘సమయం మీరిపోతోంది. గరుత్మంతుడిని తొందరగా రమ్మను’ అన్నాడు విష్ణువు. స్మరణ మాత్రం చేతనే గరుత్మంతుడు తన దేవర చెంత

నేనే శివుడు.. శివుడే నేను!

భగవంతుడిని, భక్తుడిని అనుసంధానించేది ‘మంత్రం’. మంత్రంలో భగవంతుడి సర్వశక్తులు నిబిడీకృతమై ఉంటాయి. మంత్రంలో ‘మన’ అంటే మనసు. త్ర అంటే బట్వాడా చేయడం. అంటే శక్తిని ప్రసరింప చేయడం. ఒక మంత్రాన్ని సరిగా నేర్చుకుని, అర్థం చేసుకుని, శ్రద్ధగా జపిస్తే అది అనవసర కోరికల వల్ల కలిగే అలజడి, అశాంతి నుంచి మనిషిని విముక్తం చేస్తుంది. సర్వ మంత్రాలలోనూ శివ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని చదివి అర్థం చేసుకుని జపించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. ఓం

Top