బ్రహ్మ శిల్పి
స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలను అన్నింటినీ సృష్టించిన తనను భూలోక వాసులు గుర్తుపెట్టుకున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదు ఎంత? అని శిల్పిని అడిగాడు బ్రహ్మ.




