నల్ల కుక్క.. తెల్ల ఆవు
శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాకుండా, తన పనిలో చాలా నైపుణ్యం కలవాడు కూడా. పైగా అతడు సదాచార పరాయణుడు. క్షురకుడైనా కూడా నిరంతర నిష్టా గరిష్టుడూ, దెవభక్తి పరాయణుడూ కూడానూ. అతని విశ్వాసానికి, శీలానికి చాలా సంతోషించిన రాయలు వారు అతడిని ‘మంత్రీ!’ అని పిలిచేవారు. మంగలిని గౌరవంగా మంత్రి అని కూడా అంటారు. ఒకనాడు రాయలు అతడిని పిలిచి, ‘నీకేం కావాలో కోరుకో!’