నారాయణుడొక్కడే సర్వజ్ఞుడు
భగవంతుడిని ప్రస్తుతించే స్తోత్రాలకు ఆధ్యాత్మిక చింతనాపరులు ‘మంత్రపుష్పం’ అనే పేరు పెట్టారు. పుష్పాలంటే పొసగని వారెవరు? అందుకే జిజ్ఞాసులకు, భక్తులకు భగవంతుడిని కొలిచే ‘మంత్రపుష్పం’ అత్యంత ప్రియమైనది. ఇంకో ముఖ్య విషయం- భగవంతున్ని స్తుతించే స్తోత్రాలకు మంత్రపుష్పాలనే పేరు ఎందుకు పెట్టారంటే- పుష్పమనేది ఆకర్షిస్తుంది. పరిమళిస్తుంది. సున్నితత్వంతో ఉంటుంది. తనలోని మధువును ఆఘ్రాణించాలనే కోరికను పుట్టిస్తుంది. మనస్సును మైమరిపింప చేస్తుంది. అందుకే భగవంతున్ని స్తుతించే మంత్రపుష్పమేదైనా.. అది మహత్తమయినది. ఆస్వాదించండి ఓం




