మీవేనా? మావి బతుకు కావా?

పాన్‍ షాపు వాడిది బతుకు కాదా? కొబ్బరి బొండాలు అమ్ముకునే వాడిది బతుకు కాదా? మెకానిక్‍ షెడ్డు వాడిది బతుకు కాదా? డ్రైవర్‍ది బతుకు కాదా? ఏం? మీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజనీర్లవే బతుకులా?’.. అని ప్రశ్నిస్తున్నాడు శ్రీవిష్ణు. ‘నీది నాది ఒకే కథ’ టైటిల్‍తో వస్తున్న ఇతగాడి మూవీలోని డైలాగులు అందరినీ ఆలోచనకు గురి చేస్తున్నాయి.. ఆసక్తి పెంచుతున్నాయి. శ్రీవిష్ణు స్టూడెంట్‍గా ఇందులో కనిపిస్తాడు. చిత్తూరు యాసలో అతను

మంచి లక్షణాలున్న అబ్బాయ్‍..

ఎంఎల్‍ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయ్‍.. ఈ ట్యాగ్‍లైన్‍తో నందమూరి కల్యాణ్‍రామ్‍, కాజల్‍ జంటగా రూపుదిద్దుకుంటోంది ఓ చిత్రం. మొదటి సగ భాగం కార్పొరేట్‍ స్టయిల్‍లో, మిగతా సగ భాగం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజకీయ ఛాయలేమాత్రం ఉండవని చిత్ర యూనిట్‍ అంటోంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని మలిచినట్టు దర్శకుడు ఉపేంద్ర మాధవ్‍ చెబుతున్నారు. కాగా, కల్యాణ్‍రామ్‍, కాజల్‍ కాంబినేషన్‍లో ‘లక్ష్మీ కల్యాణం’ అనే సినిమా

రజనీ ఆధ్యాత్మిక యాత్ర

సూపర్‍స్టార్‍ రజనీకాంత్‍ ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక యాత్ర చేయడం మామూలే. ఈసారీ ఆయన స్పిరిచ్చువల్‍ జర్నీ షురూ అయ్యింది. వారం పది రోజుల పాటు ఆయన సినిమాలకు, లౌకిక ప్రపంచానికి దూరంగా ఈ యాత్రను సాగించనున్నారు. తొలిగా ఆయన ధర్మశాల వెళ్లారు. అక్కడి శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత రిషికేష్‍కు బయల్దేరారు. అనంతరం హిమాచల్‍ ప్రదేశ్‍లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ వందేళ్ల వేడుకలో పాల్గొంటారు.

‘సాహూ’.. వాట్‍నెక్స్ట్

‘బాహుబలి’ వంటి బోల్డ్ హిట్‍ తరువాత ప్రభాస్‍ చేస్తున్న ‘సాహు’పైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుంది? ఇందులో ప్రభాస్‍ క్యారెక్టర్‍ ఏమిటి? అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఇది భారీ బడ్జెట్‍తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, ‘సాహు’ తరువాత ప్రభాస్‍ నటించే మరో సినిమా కూడా ఖరారైనట్టు సమాచారం. రాధాకృష్ణ కుమార్‍ చెప్పిన కథ నచ్చిన ప్రభాస్‍ ఇందుకు

ఊ.పె.కు.హ..

నవ్వుల రాజు రాజేందప్రసాద్‍ మునుపటి మాదిరిగా నవ్వులు పంచడానికి రెడీ అయిపోయారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ఎనభై మంది నటీనటులతో ఊ.పె.కు.హ. (ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి) సినిమా తెరకెక్కింది. ఇందులో రాజేందప్రసాద్‍తో పాటుగా సాక్షి చౌదరి, బ్రహ్మానందం, అలీ, రిషి, ఖయ్యూం, ధనరాజ్‍, కృష్ణుడు, సాయి, హేమంత్‍ ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిధి’ ప్రసాద్‍ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..

Top