త్రివిక్రమ్‍ కథ.. పవన్‍ నిర్మాత

‘రౌడీఫెలో’ దర్శకుడు కృష్ణచైతన్య తాజాగా నితిన్‍, మేగా ఆకాశ్‍ జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణంలో నితిన్‍ సొంత బ్యానర్‍తో పాటు పవన్‍కల్యాణ్‍ క్రియేటివ్‍ వర్కస్ కూడా పాలు పంచుకుంటోంది. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‍ కథను అందిస్తున్నారు. ప్రేమ, ఫ్యామిలీ, వినోదాంశాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్‍ 5న విడుదల చేయడానికి

ఏనుగులతో రాణా ఫ్రెండ్షిప్

రాణా ఈ మధ్య ఏనుగులతో స్నేహం చేస్తున్నాడు. ఒకటీ రెండూ కాదు దాదాపు ఇరవై రోజుల పాటు వాటికి దగ్గరగా గడపబోతున్నాడు. ఇదంతా ఓ సినిమా కోసం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘హాథీ మేరే సాథీ’ అనే చిత్రం రూపొందబోతోంది. తెలుగు, తమిళ వెర్షన్లకు ఇంకా టైటిల్‍ కన్ఫార్మ్ చేయలేదు. బహుశా తెలుగులో ‘అడవిరాముడు’ అనే టైటిల్‍ ఫిక్స్ కావచ్చని ఫిల్మ్నగర్‍ వర్గాల భోగట్టా. ఇకపోతే ఈ చిత్రంలో

చిట్టిబాటు ఆటపాట…

చిట్టిబాటు మాంచి హుషారు మీద ఉన్నాడు. ఓ పాట పాడుకోవాలని అనిపించింది. వెంటనే అందుకున్నాడు. అంతేకాదు. అదే ఊపు మీదు స్టెప్పులు కూడా వేశాడు. అతను డ్యాన్స్ చేయడం చూసి పక్కనే ఉన్న సుందరాంగి కూడా చెట్టాపట్టాలు కట్టింది. వీళ్లిద్దరినీ చూసి ఊరు ఊరంతా పదం కలుపుతూ పాదం కలిపింది. ఇంకేముంది.. కట్‍ చేస్తే అందమైన పాట. ఇదంతా ‘రంగస్థలం’ సినిమాలోని ఓ పాట సన్నివేశం. చిట్టిబాబుగా రామ్‍చరణ్‍ నటిస్తున్న

అమెరికా వెళ్లాలంటే…

అమెరికా వెళ్లాలంటే మాటలు కాదు. ఎన్నో ప్రయత్నాలు చేయాలి. తీరా వెళ్లాక అక్కడ నిలదొక్కుకోవడమూ కష్టమే. సరిగ్గా ఇదే కథాంశంతో తెరకెక్కుతోంది ‘ఎ టు ఎ’ అనే చిత్రం. ‘అమీర్‍పేట టు అమెరికా’ అనేది ఈ టైటిల్‍కు ట్యాగ్‍లైన్‍. అమెరికాలో అడుగు పెట్టాలనుకునే యువత ఆలోచనలు, ఆశయాల నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. చల్లా భానుకిరణ్‍ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిని మాలో తేజస్‍, పల్లవి, బ్రహ్మా నందం,

మనవడొచ్చాడు!

ఇది చదివి సినిమా టైటిల్‍ అనుకోకండి. మంచు మోహన్‍బాబు కుటుంబంలో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు ఇటీవలే కొడుకు పుట్టాడు. కొత్త ఏడాది ప్రారంభంలో ఇంట్లోకి ఓ కొత్త సభ్యుడు రావడంతో మంచు కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. విష్ణు, వెరోనికా దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) సంతానం. మూడో సంతానంగా అబ్బాయి పుట్టాడు. ‘అవ్రామ్‍ భక్త’ అనే పేరు పెట్టారు. ‘అవ్రామ్‍’ అంటే ఎవరూ ఆపలేని వాడు

Top