
కావాల్సినవి: అన్నం: మూడు కప్పులు, పుదీనా ఆకులు: ఒకటిన్నర కప్పు, తాజా కొబ్బరిముక్కలు: అరకప్పు, వెల్లుల్లి: అయిదు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నెయ్యి: పావుకప్పు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: టేబుల్‍స్పూన్, మినప్పప్పు: టేబుల్‍స్పూన్, జీడిపప్పు: అరకప్పు, దాల్చినచెక్క: చిన్నముక్క, యాలకులు: నాలుగు.
తయారు చేసే విధానం: ముందుగా పుదీనా, కొబ్బరిముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు మిక్సీలో వేసుఎకుని మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, దాల్చినచెక్క, యాలకులు వేయించుకుని చేసి పెట్టుకున్న పుదీనా పేస్టును వేసి వేయించాలి. అన్నీ వేగాక అన్నం కూడా వేసి బాగా కలిపి దించేస్తే సరిపోతుంది.
Related posts
Telugu Association of Greater Boston Ugadi Celebrations
North America Telugu Association(NATA)Celebrated Women's Day AT Dallas Convention Center
Colorado Telugu Association - Ugadi Vedukalu
Greater Washington Telugu Cultural Sangam Sankranti Celebrations In Maryland | USA
ఆవకాయ ‘కూర’
Telangana American Telugu Association Celebrates Bathukamma In New York
Related posts


Review పుదీనా రైస్.