నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న చిత్రానికి ‘దాదా’ అనే టైటిల్ ఖరారైంది. ఈ మేరకు ఇటీవల టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. ‘దేఖో షేర్ ఆగయా..’ అనే డైలాగ్‍తో మొదలైన ఈ గ్లింప్స్ ఆద్యంతం బాలకృష్ణ యాక్షన్ హంగామాతో ఆసక్తికరంగా సాగింది. ముంబై బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలకృష్ణ శక్తివంతమైన గ్యాంగ్‍స్టర్ పాత్రలో అలరించనున్నట్టు అర్థమవుతోంది. ‘నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గరు ఉంటే సరిపోదు. బుల్లెట్స్కి బలుపుండాలి. గన్స్కి గట్స్ ఉండాలి’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అదిరింది. ఈ ఏడాది డిసెంబరు 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.




























































































































































































































































Review బాలకృష్ణ ‘దాదా’.