నిన్ను మింగే తీపి కన్నా నువ్వు మింగే చేదు మిన్న
శ్రీరామ్ గారి లేఖలు జీవితంలో మనం మాట్లాడుకునే చాలా విషయాలు, చెప్పుకునే చాలా కబుర్లు.. ఇవన్నీ మాకెందుకని అనుకుని ఏదో క్షణంలో అనుకుంటాం. కానీ, అవన్నీ ఇప్పుడు కాకపోయినా, ఎపుడైనా జీవితంలో అందరికీ అవసరమైనవే. అందుకే రాస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం. అందుకే నేను రాసే చాలా ఉత్తరాలు చూడటానికి ఇతర వ్యక్తులకు రాస్తున్నట్లు అన్పించినా, నిజానికి అవి నాకు నేను రాసుకున్న ఉత్తరాలు.




