కనుమ పిలుస్తోంది.. కలిసుందాం రమ్మని

మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో చివరిది- కనుమ. ఇది పశుపక్ష్యాదులకు ప్రత్యేకించిన పండుగ. అరక కట్టి పొలాన్ని దున్నడం మొదలుకుని, చేతికందిన పంటను ఇంటికి తీసుకురావడం వరకు కర్షకులకు సేద్యంలో చేదోడువాదోడుగా ఉండేవి పశువులే. వీటికి కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. ఈనాడు పశువులు ఉన్న ఇంట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. అందంగా అలంకరిస్తారు. మెడలో గంటలు కడతారు.

సంక్రాంతి వేళ ఏ రాశి వారు ఏ దానం చేయాలి?

పండగంటే.. పిండివంటలు చేసుకుని తినడం మాత్రమే కాదు. ఉన్నది ఇతరులతో పంచు కుని ఆనందాన్ని పంచుకోవడం కూడా మన పండుగల్లో దాగి ఉన్న ముఖ్య సందేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దానధర్మాలు మంచి ఫలితాలనిస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం సంపాదించు కోవాలని మన పెద్దలు నిర్దే శించారు. ఆయా రాశుల వారు ఆయా వస్తువులను దానం చేయాలి. దీనివల్ల పుణ్యం సంగతలా ఉంచితే..

నీలోకి ప్రయాణం..

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

ముగ్గు చూడు.. ముగ్గందం చూడు

సంక్రాంతి పండగ వేళ, పల్లెటూరి తెలుగింటి పడుచుల సృజనాత్మకత రంగుల హరివిల్లులా వెల్లివిరుస్తుంది. వాళ్ల మునివేళ్ల చివరి నుంచి ఒడిసిపట్టే ముగ్గులు ఎన్ని రకాలో ! శివుడి కళ్లు, పద్మాలు, గుంటల కోనేరు, పాముల బుట్ట, ఏనుగుల ముగ్గు, పతంగుల ముగ్గు, పన్నీరు బుడ్డి, గంధపు గిన్నె, మల్లె పందిరి, తాబేలు, కొబ్బరిబోండాలు, అడ్డబాస, విస్తరాకు, బాణం, తులసికోట, గుమ్మడికాయ, వరివెన్నులు, గాదె.. ఇలాంటి ముగ్గులను వరుస చుక్కలతో,

గోమాతను పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపాల నుంచి విముక్తి చెంద డానికి ఏదైనా మార్గాన్ని, తరుణోపాయాన్ని తెలపండి’ అని కోరిందట. గోమాతకు చేసిన పూజల వలన కలిగే ఫలితాల గురించి అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఈ విధంగా చెప్పాడట. ‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. గోవు పాదాల యందు పితృదేవతలు, కాళ్ల యందు సమస్త పర్వతములు, భ్రూ మధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు,

Top