తెలివితేటలు
అనేకానేక పూర్వజన్మలు కలిగిన బోధిసత్త్వుడు (బుద్ధుడు) ఒకానొక పూర్వ జన్మలో వందల బండ్లతో వర్తకం చేసే సార్థవాహక వంశంలో జన్మించాడు. ఒకసారి అతడి బిడారు అరవై యోజనాల నిడివి ఉన్న ఎడారి ప్రాంతానికి చేరింది. పగలంతా భగభగ మండే కుంపటిలా ఎండ ఉండటంతో రాత్రి వేళల్లోనే ప్రయాణించే వారు. నక్షత్రాల సాయంతో దారి గమనిస్తూ ముందుకు సాగేవారు. మరో యోజనం మాత్రమే ప్రయాణం మిగిలి ఉందనగా, బరువు తగ్గించుకుంటే ప్రయాణం




