కాళిదాసు గర్వభంగం

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె వద్దకు వెళ్లాడు. ‘దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వండి’ అని గుమ్మం ఎదుట నిలిచి అడుగుతాడు. గుడిసె లోపలి నుంచి ఓ ముదుసలి మహిళ వచ్చి ‘మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు?’ అని ప్రశ్నిస్తుంది. ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు’ అన్నాడు కాళిదాసు ఒకింత

రెంటికీ చెడిన రేవడి

రేంవడు అంటే రజకుడు. ఈ సామెత పుట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రేవు ఉండేది. చాకలి రోజూ ఆ రేవుకు వచ్చి బట్టలు ఉతుకుతుండే వాడు. ఒకరోజు సగం బట్టలు ఉతికి ఒడ్డున ఆరేస్తుండగా, అకస్మాత్తుగా వాగు పొంగింది. ‘అయ్యో! అయ్యో! నా బట్టలు’’ అంటూ అతడు కొట్టుకుపోతున్న బట్టలను పట్టుకోవడానికి వాగులోకి పరుగెత్తాడు. కానీ, అప్పటికే కొన్ని బట్టలు వాగులోకి

అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు

అవధానం` ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, మధ్యలో పృచ్ఛకులు అడిగితే అప్రస్తుత ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ, ఆశువుగా పద్యాలు చెబుతూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ అవధాని ఆధ్యంతం నవ్వులు పూయిస్తారు. ఇన్ని ప్రశ్నలను, చమత్కార పూరణలను, అప్రస్తుత ప్రశ్నలను ఏకకాలంలో ఎదుర్కొంటూ అవధాని చేసే సాహితీ విన్యాసం ఎంతైనా గొప్పది. ఒక అవధానంలో కొందరు పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగే

అమ్మవారిల్లు..మణిద్వీపం

శ్రీచక్ర బిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలిత అయిన జగన్మాత నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో అమ్మ కొలువై ఉంది. యావత్తు జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ మణిద్వీపం ఉద్భవించింది. నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న మణిద్వీపం గురించి వర్ణించాలంటే మన శక్తి

ఉపమన్యు మహర్షి

ఉపమన్యు మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడనే మహర్షి పెద్ద కొడుకు. ఉపమన్యుడి తమ్ముడు ధౌమ్యుడు. ఇద్దరూ ఒకనాడు బంధువుల ఇంటికి వెళ్లి పరమాన్నం తిన్నారు. ఇంటికొచ్చి అలాంటి పరమాన్నం చేసిపెట్టు అని తల్లిని కోరారు. అవసరమైన దినుసులు లేవని, కాబట్టి ఆ కోరిక తీరడానికి ఈశ్వరుడి గురించి తపస్సు చేయాలని, ఆయన ఏం అడిగినా ఇస్తాడని తల్లి చెబుతుంది. శివుడు ఎలా ఉంటాడని ఉపమన్యుడు తల్లిని అడిగాడు. తనకు తెలిసినంత ఆమె చెప్పింది.

Top