శివ శివ శంకర
ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. ‘జన్మకో శివరాత్రి’ అని నానుడు. కానీ, మన అదృష్టం కొద్దీ ఏడాదికోసారి మహా శివరాత్రి వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమించి కంఠంలో దాచుకున్న రోజును మహా శివరాత్రిగా పాటించడం ఆచారం. పురాణాలే కాదు వాటి కంటే పురాతనమైన వేదాల




