శివుడు, యముడు పక్కపక్కనే..
ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం- కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.. పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుండటంతో ఈ దేవాలయం ఒక్కసారిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‍పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమణీయమైన ప్రకృతి మధ్య, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన




