మనందరి ‘స్టార్’ మార్చిన మాష్టార్లకు వందనం
గణితం మాస్టారు సెలవు పెట్టారని తెలిస్తే ఎగిరి గంతేసిన రోజులు.. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పీరియడ్ అయితే ఆ రోజు పండుగే. సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తారు.. అవి ఎవరి వీపు పగలుగోడతాయోనని క్లాసయ్యే వరకు ఒకటే భయం.. గ్రామర్ చెప్పే ఆంగ్లం టీచర్ ఎప్పటికీ గ్లామర్‍గానే కనిపించే వారు.. సోషల్ టీచర్ పాఠాల కంటే జోకులే బాగా చెబుతారని టాక్.. ఇవన్నీ మన పసిడి బాల్యంలో కేరింతలు కొట్టించిన రోజులు.. ఏదేమైనా ఆ
