అమ్మను మించి దైవమున్నదా..

అమ్మ గురించి మన తెలుగు కవులు, సినీ గీత రచయితలు పలికించిన కమ్మని పలుకులు ఒకసారి చదువుదామా.. ‘అమ్మ వంటి అంత మంచిది అమ్మ ఒక్కటే’ అని మనసు కవిగా పేరొందిన ఆత్రేయ అన్నారు. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే

జార్జియాలో మన తెలుగు ఉగాది వెలుగు

మన తెలుగుకు గొప్ప గెరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని జార్జియా రాష్ట్రం.. మన తెలుగు పర్వదినమైన ‘ఉగాది’కి అరుదైన గుర్తింపు, గౌరవం లభించాయి. రాష్ట్ర గవర్నర్‍ బ్రయన్‍ పి.కెంప్‍.. ‘తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది పండుగను గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. మన తెలుగు జార్జియాలో వెలుగొందడం వెనుక ఎంతో కృషి ఉంది. 1980 నుంచి అట్లాంటా తెలుగు

అమ్మా.. అన్నీ నీవే!

భవానీ అష్టకంలో అమ్మ గురించి, ఆమె గొప్పతనం గురించి, ఆమె అమృతమయమైన ప్రేమ గురించి ఎంతో గొప్ప వర్ణనలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని శ్లోకాలు.. న తాతో న మాతో న బన్ధు ర్న దాతా న పుత్రో న పుత్రీ నభృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తి ర్మ మైవ గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని ‘‘అమ్మా! ఓ భవానీ! నాకు తల్లిగానీ, తండ్రిగానీ, కొడుకు గానీ, కూతురుగానీ,

ధర్మదీక్షకు సిద్ధమేనా?

ఒకసారి బుద్ధుడు విశాల •వటవృక్షం కింద కూర్చుని జ్ఞానబోధ చేస్తున్నాడు. అందరూ భక్తిశ్రద్ధలతో ఆ బోధనలు వింటున్నారు. అంతలో అక్కడికి రాజభటులు ఒక దొంగను తీసుకువచ్చారు. రాజభటులు బుద్ధుడికి వినయంగా నమస్కరించి- - ‘భగవాన్‍! ఈ దొంగ గతంలో మీ వద్ద ధర్మదీక్ష తీసుకున్నట్టు చెబుతున్నాడు. మహారాజు వాస్తవం ఏమిటో కనుక్కోమని మమ్మల్ని పంపారు’ అని చెప్పారు. బుద్ధుడు ఆ దొంగకేసి కొద్దిసేపు చూశారు. ‘నీ పేరు ఏమిటి?’ అడిగాడు బుద్ధుడు. ‘ధర్ముడు’ అని చెప్పాడు దొంగ. ‘నువ్వు

ఆ అయిదే కారణం

ఒకసారి బుద్ధుడు తన ధర్మాన్ని శ్రావస్తీ నగర పరిసరాలలో ఉపదేశిస్తున్నప్పుడు ఒక సంపన్నుడు ఆయన వద్దకు వచ్చాడు. అనేక రోగాలతో బాధపడుతున్న ఆయన చేతులు జోడించి ఇలా అన్నాడు- ‘బుద్ధుడా! నీకు చేయవలసిన విధంగా ప్రణామం చేయనందుకు నన్ను క్షమించండి. ఊబకాయం, నిద్రమత్తు, ఇంకా ఇతర అనారోగ్య కారణాల వల్ల నేను బాధలు పడుతున్నాను. శరీరంలో ఏ అవయవాన్ని కదిలించినా తీవ్రమైన నొప్పులు’ అని వాపోయాడు. అతని చుట్టూ అలముకుని ఉన్న విషయ భోగాలను

Top