అమ్మా.. అన్నీ నీవే!

భవానీ అష్టకంలో అమ్మ గురించి, ఆమె గొప్పతనం గురించి, ఆమె అమృతమయమైన ప్రేమ గురించి ఎంతో గొప్ప వర్ణనలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని శ్లోకాలు..
న తాతో న మాతో న బన్ధు ర్న దాతా
న పుత్రో న పుత్రీ నభృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తి ర్మ మైవ
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని

‘‘అమ్మా! ఓ భవానీ! నాకు తల్లిగానీ, తండ్రిగానీ, కొడుకు గానీ, కూతురుగానీ, యజమాని గాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియు లేదు. కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు’’.
భవాబ్దావసారే మహాదు:ఖ బీరు
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్త
కుసంసార పాశప్రబద్ధ సదాహం
గతిస్త•ం గతిస్త్వం త్వ మేకా భవానీ

అమ్మా! భవానీ! కామాంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మ పాశబద్ధుడనై, భరించలేని దు:ఖంతో మిక్కిలి భయాన్వితుడనై సంసార సాగరమున మునిగిపోయాను. తల్లీ! నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.
న జానామి దానం న చ ధ్యాన యోగం
న జానామి యంత్రం న చ స్తోత్ర యంత్రం
న జానామి పూజాం న చ న్యాస యోగం
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవానీ

అమ్మా! భవానీ! దానము, ధ్యానము, మంత్రము, యంత్రము, పూజ- పునస్కారము, న్యాసము, యోగము.. ఇవేవీ నాకు తెలియవు. తల్లీ నీవు తప్ప నాకెవరూ దిక్కు లేరు. నీవే దిక్కు.
న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్‍
న జానామి భక్తిం వ్రతం వాపి మాత
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవానీ

అమ్మా! భవానీ! పుణ్యకార్యము లేదు. తీర్థసేవ లేదు. మోక్షోపాయము తెలియదు. జన్మరాహిత్యము తెలియదు. భక్తి మార్గము తెలియదు. ఏ వ్రతములు తెలియవు. తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.
కుకర్మీ కు సంగీ కు బుద్ధి కు దాస
కు లాదారహీన కదా దారహీన
కుదృష్టి కు వాక్యప్రబంధ సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
తల్లీ! దుష్కర్మాచరణము, చెడు సాంగత్యము, దుర్బుద్ధులు, దుష్టసేవకజనము, కులాచారహీనత్వం, దురాచార తత్పరత, చెడు ఆలోచనలు, చెడ్డమాటలు మాట్లాడటం ఇవి నా లక్షణములు. అందుచేత నీవు తప్ప నన్ను ఉద్ధరించుటకు వేరే దిక్కులేదు.

మనం అందరిలో లోపాలు వెతుకుతాం. కానీ, మనలో ఎన్ని లోపాలు ఉన్నా మనల్ని మనల్నిగా ప్రేమించేది ఈ సృష్టిలో అమ్మ ఒక్కటే.
మాతృదేవోభవ

ఈ సృష్టికి అమ్మ ఒక్కతే. స్త్రీలందరిలోనూ అమ్మను చూడాలన్నారు పెద్దలు. మరి కుమార శతకంలో ‘పంచమాతలు’ గురించి వర్ణించారు. అంటే ప్రధానంగా ఐదుగురిని అమ్మగా ఎంచి పూజించాలని ఈ శతకంలో చెప్పారు.

ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కుతకాంతను గన్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా
రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త), కన్న తల్లి (మాతృమూర్తి).. ఈ ఐదుగురిని పంచమాతలుగా భావించాలి. ఆదిశంకరుల వారిని పెంచి పెద్ద చేసింది తల్లే. ఆయనకు తన మాతృమూర్తితో అల్లుకున్న బంధం ఎంతో గొప్పది. అందుకే ఒక సందర్భంలో ఆయన ఇలా చెప్పారు-

కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి
‘పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు’ అని పై శ్లోకానికి తాత్పర్యం.
ఇక, సుమతీ శతకకారుడు అమ్మ గురించి ఏమన్నారో చదవండి..
ఇమ్ముగ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్‍
దమ్ముల బిలువని నోరును
గుమ్మరిమను దవ్వినట్టి గుంటర సుమతీ!
‘ఇంపుగా పఠింపని నోరె••, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు, కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమాన’మని పై సుమతీ శతకానికి భావం. అమ్మ గురించి ఇంకా ఎందరో మహానుభావులు ఇంకా ఎంతో గొప్పగా చెప్పారు. అమ్మ గురించి, ఆమె దయామయత్వం గురించి చెప్పడానికి, వర్ణించడానికి ప్రపంచంలో ఉన్న భాషలు కూడా సరిపోవు.

Review అమ్మా.. అన్నీ నీవే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top