బంగారు లేడి
ఒకప్పుడు బోధిసత్త్వుడు (బుద్ధుడు) బంగారు లేడిగా జన్మించి, ఒక మర్రిచెట్టు కింద నివసిస్తుండే వాడు. దాదాపు అయిదు వందల లేళ్ల మందకు అతడు పెద్దగా ఉండేవాడు. అక్కడకు దగ్గరలోనే ఉన్న రావిచెట్టు కింద ఉంటూ అది కూడా అయిదు వందల లేళ్ల మందకు నాయకుడిగా ఉండేది. కాశీరాజుకు వేట వ్యసనంగా ఉండేది. తనతో వేటకు రావాలంటూ ప్రజలకు నిర్బంధించే వాడు. ఇది భరించలేక ఒకసారి కొందరు ముఖ్యులు అడవిలోకి వెళ్లి




