ఉత్తరాయణం

సంక్రాంతి సందడి తెలుగు పత్రిక జనవరి సంచికలో సంక్రాంతి సందడి కళ్లకు కట్టింది. ఈ పర్వం విశేషాల గురించి మునుపు తెలియని విషయాలను తెలుసుకో గలిగాం. చాలా వివరంగా వివరాలు అందిం చారు. అలాగే, పుష్య మాసం గురించి అందించిన విశేషాలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాయన పుణ్య కాలం ప్రవేశించే వేళ చేయాల్సిన విధాయ కృత్యాలు, నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలుసుకోగలిగాం. ముఖ్యంగా సంక్రాంతి పుణ్య కాలంలో దాన ధర్మాలు

ఆత్మ ప్రబోధ గీతం

శివభక్తితో శివగీత ప్రారంభ మవుతుంది. నవవిధ భక్తి మార్గాల్లో శరణా గతి అత్యుత్తమ మైనదని మహర్షులు చెబుతారు. ఇందుకు ప్రతీకగా, శివగీత.. శివ శరణాగతితో ప్రారంభమై శివ శరణాగతితోనే ముగుస్తుంది. భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు భగవంతుడి శరణాగతి కోరాల్సిందే. అంతకు మించిన మార్గాంతరం లేదు. అనేక సందర్భాల్లో పురాణ, ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూ పించాయి కూడా. నారద భక్తి సూత్రాలు కూడా ‘అధాతౌ భక్తిం వ్యాఖ్యాస్యామ:’ అంటూ

హరికి హరుడి గీతోపదేశం

శ్రీ రాముడికి కర్తవ్య బోధ చేసిన 'శివగీత' మన సనాతన సాహిత్యంలో విష్ణుగీత, నారదగీత, దేవీగీత, అష్టావక్ర గీత, వ్యాసగీత, శ్రీరామగీత, గురుగీత, సిద్ధగీత, రుద్రగీత, గణేశగీత, భగవద్గీత.. ఇలా ఎన్నో ‘గీత’లున్నాయి. ఇవన్నీ ఆయా సందర్భాలలో జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం ఆవిర్భవించినవే. అయినప్పటికీ వేటికవే ప్రత్యేకంగా తమ వైవిధ్యాన్ని ఇవి ప్రకటిస్తాయి. అటువంటి వాటిలో శివగీత ఒకటి. ఆత్మానాత్మ వివేకాన్ని తెలిపే సకల వేదసారం భగవద్గీత.. అర్జునుడికి

అందమైన ‘స్వప్నం’ అందరికీ సొంతం.

అందమంటే పైపై మెరుగులే కాదు. అందానికి ఇదివరకటి అర్థం మారిపోయింది. అందంగా ఉండటం అంటే నేడు ఆత్మవిశ్వాసంతో ఉండటం. ఆత్మవిశ్వాసంతో ఉన్న వారే అందమైన మంచి పనులు చేయగలరు. అందంగా ఉన్నామనే, అందంగా ఉండాలనే భావన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాక, మనసును ఉత్తేజితం చేస్తుంది. అందులోనూ అమ్మాయిల్లో, మహిళల్లో అందం పట్ల మక్కువ మరీ ఎక్కువ. అటువంటి ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మగు వలకు అందించడానికి అందుబాటులోకి

మాఘం… అమోఘం

ఆంగ్ల కాలమానం ప్రకారం సంవత్సరాల వరుసలో రెండవది- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఇది మాఘ మాసం. పదకొండవది. ఈ మాసం రెండు విధాలుగా మహత్తయినది. ఒకటి- లోకాలను పాలించే మహా దేవుని మహా శివరాత్రి పర్వం, రెండు- లోకాలకు వెలుగులను పంచే వెలుగుల రేడు సూర్య భగవానుని రథ సప్తమి తిథి.. ఈ రెండూ మాఘ మాసంలోనే రావడం విశేషం. ఇంకా ప్రపంచంలోనే అతి పెద్దదైన

Top