ఆరు రుచులు.. అరవై రకాల మేలు
ఉగాది పచ్చడి
ఉగాది పర్వదిన సందర్భంగా చేసుకునే ఆహార పదార్థాలు, నైవేద్యాల్లో ఉగాది పచ్చడి, బొబ్బట్లు, వడపప్పు, పులిహోర ముఖ్యమైనవి. వీటిలో ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. ఈ షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కటు (కారం), కషాయం (వగరు), లవణం (ఉప్పు), తిక్త (చేదు) రుచులు మిళితమై ఉంటాయి. ఈ ఆరు రుచులు జీవితంలో ఎదురయ్యే సంతోషం (తీపి), దు:ఖం




