5.3.1991, నిజామాబాద్ మిత్రులు విజయకుమార్ గార్కి ఉగాది శుభాకాంక్షలతో ..

మీ ఉత్తరాలు చేరాయి. ఆధ్యాత్మిక విష యాలలో మీరు కనబర్చే ఆసక్తి, ఉత్సుకత ఎంతో హర్షాన్ని కల్గించాయి. దాదాపు అందరి జీవితాల్లో అనేక సమస్యలు అనేక విధాలుగా బాధిస్తూ మనకు దు:ఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు సమస్యలు పూర్తిగా అదృశ్యమవటమంటూ ఉండదు. అయినా ప్రతి సమస్యకూ రెండు కోణాలుంటాయి. సమస్య యొక్క సంక్లిష్టత అన్నది – సమస్య యొక్క జటిలత్వం మరియు ఆ సమస్యను అనుభవించే వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఒకరికి సమస్యగా ఉన్నది వేరొకరికి సమస్యగా ఉండకపోవచ్చు. ఒక కిలో బరువు చిన్న పాప తలపై ఉంచితే అది చాలా భారంగా అనిపించదు. కారణం ఇక్కడ బరువు తగ్గటం కాదు. బరువును భరించే శక్తి పెరగటం. సమస్యలను పరిష్కరించటంలో ఈ రెండవ అంశంపై ఎక్కువ దృష్టి నిలపాలి. చాలామంది మొదటి అంశాన్ని ఎక్కువగా లెక్కలోనికి తీసుకుంటారు. దానివల్ల అనుకున్న ఫలితం ఉండదు. అందువల్ల దు:ఖం తిరిగి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది.
అందువల్ల మనమే సమస్యలకు అందనంత ఎత్తుకు మానసికంగా ఎదగాలి. ఆ విధంగా మనో పుష్పం వికసించి పరిమళ సౌరభాలను వెద జల్లడమే ఆధ్యాత్మికత అంటే. ముళ్ల మధ్య సగ ర్వంగా తలెత్తి ఊగే గులాబీలా జీవించాలి. ఈ ప్రయాణంలో అతి ముఖ్యమైన మజిలీ భగ వంతునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండటం. ఆ తర్వాత ముఖ్యమైంది. జీవితంలో ధైర్యంగా ఉండటం. దేనికీ భయపడకూడదు. జీవితంలోని అన్ని సమస్యలు ఒక్కసారి అగ్ని కెరటంలా ఎగసిపడినా చలించకూడదు. లంఘించి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చే సింహ కిశోరానికుండే గుండె ధైర్యం కావాలి. అలాంటి నిర్భీతియే (•వ•తీశ్రీవ•• అవ••) సర్వ ఉపనిషత్తుల సారాంశం. పై రెండు ఆయుధాలు మన దగ్గరున్నంత వరకు ‘ప్రశాంతత’ వీడదు. అశాంతి మన దగ్గరకు రాదు.
మన గురించి, మనకేది అవసరమో మనకంటే మనల్ని సృష్టించిన భగవంతునికి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఏది చేసినా మన మంచి కోసమే ఉంటుంది. అందుకని జరగేదాన్నంతా ఒక ప్రేక్షకునిలా చూస్తూ అనుభవిస్తూ పోవాలి. ఎటూ తోచని పరిస్థితి ఏర్పడినపుడు మన మనస్సాక్షిని అనుసరించాలి. మనకు తోచింది చేయాలి. చేయించేవాడు ఆయనే కాబట్టి.
మనం నడిచే దారిలో ముళ్లున్నపుడు మనం రెండు మార్గాలు అనుసరిస్తాం. ఒకటి సాధ్యమైనంత వరకు ముళ్లను తొలగించటం. రెండవది చెప్పులు వేసుకుని నడవటం. రెండవ పద్దతి మొదటి దాని కంటే మెరుగైంది. అదే భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకుని, మన భారాలన్నింటిని ఆయన తలపై పెట్టి మనం హాయిగా ఉండటం. అలాంటి తైల ధారలాంటి అవిశ్రాంత ప్రశాంతి – భగవంతుణ్ణి గుళ్లోంచి మన గుండెల్లోకి మార్చటం వల్ల వస్తుంది. సముద్రమెంత విశాలమైనదైనా భగ వంతుని కృప అనే పడవలో ప్రయాణిస్తే సంసార సాగరం మనల్ని బాధించదు.
మీరు దేని గురించీ విచారించకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ, నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని గడపండి. మీరు చేయ గలిగిందల్లా చేస్తూ, మిగతా విషయాలను భగ వంతునికి వదలి నిశ్చతంగా ఉండండి. క్షణ భంగురమై, క్షణంలో ఆగిపోయే బొంగరం లాంటి ఈ జీవితంలో దేనికీ విచారించవలసిన పనిలేదు. ధైర్యంగా ఉండండి.
స్వామీ వివేకానంద అంటారు.•ఔష్ట్ర••వఙవతీ శీ••వ•• •శీ• ఎ•• ఎవ•ఱ•••వ శీఅ, × ఎవ•ఱ•••వ శీఅ •ష్ట్రవ •వ•తీ• శీ• • •ఱశ్ణీ అలాంటి ధైర్యం జీవితంలో అవసరం.
అలాంటి ధైర్యం భగవంతునిపై, ఆయన ప్రేమపై, ఆయన చేసే పనుల్లో – అచంచల విశ్వాసం ఉండటం వల్ల వస్తుంది. మీ పొరుగు వాళ్లు, బంధువులు, స్నేహితులు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోకండి. లోకాన్ని కాసేపు మరిస్తే శోకం అదే నశిస్తుంది. ప్రశాంతతో మీ పరిణయం జరుగుతుంది. ప్రహర్షం మీ జీవి తాల్లోకి ప్రవేశిస్తుంది. మీ హృదయం మహానీయ మానవ సరస్సులో కేరింతలు కొడూతూ తిరిగే వినిర్మల రాజహంసలా పరుగులు తీస్తుంది. మీ ఎదలో ఎల్లలు దాటే సంతోష సౌరభ పరిమళాలు నిండుతాయి.
చేతిలో దీపమున్నవాడు చీకటికి భయపడనట్లు మనసులో భగవంతుణ్ణి బంధించిన వానికి ఏ భయమూ జీవితంలో బాధించదు. ఏవైనా సంఘ టనలు మీరనుకున్నట్లు జరగకపోతే భగవంతుణ్ణి తనకు నచ్చిన రీతిలో చేయనివ్వండి.
చిన్నారి పాపకు తనకేమి మంచిదో చెడుదో తనకన్నా అమ్మకు బాగా తెలుసు. పాపకు బొమ్మలు (ణశీశ్రీశ్రీ• •ష్ట్రఱ•ష్ట్ర స్త్రఱఙవ •వశ్రీఱస్త్రష్ట్ర•) తాత్కాలికంగా ఆనందపర్చ గలవే కాని శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. అందు కనే అమ్మ కనపడగానే అన్నీ వదలి పరుగెత్తు తుంది. అలాగే – ‘బొమ్మ’ను వదలి ‘అమ్మ’ను చేరటమే ఆధ్యాత్మికత.
•జూఱతీఱ•••శ్రీఱ•• ఱ• •ష్ట్రవ జూతీశీ•వ•• శీ• శ్రీవ•ఙఱఅస్త్ర •ష్ట్రవ •శీశ్రీశ్రీ •అ• శ్రీశీఙఱఅస్త్ర •ష్ట్రవ •ఱఙఱఅఱ••. మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి, అవకాశం, ఆకుంఠిత దీక్ష ఉన్నాయి. కాబట్టి మీకు అసాధ్యం ఏదీ ఉండదు. ప్రయత్నించి చూడండి. దీవ • శ్రీఱ••శ్రీవ ఎశీతీవ జూ••ఱవఅ•బీ •వ • శ్రీఱ••శ్రీవ ఎశీతీవ •శీశ్రీ•. •శీ• •ఱశ్రీశ్రీ •వ •ష్ట్ర•• •శీ• ••అ• •శీ •వ.
రవి రాజుగారు కలిసినపుడల్లా ‘గోపి’ గురించి జ్ఞాపకం చేస్తుంటారు. నాక్కూడా చాలాకాలంగా గోపి గారిని కలవాలని ఉంది. ఇంకా అవకాశం రాలేదు. ఒకవేళ నేను వేసవి సెలవుల్లో మద్రాసు రాగలిగితే కలవవచ్చు.
మన జీవితాల్లో మనకు ఆనందం కలిగించే విషయాల్లో అతి ముఖ్యమైంది ప్రేమ. అది మన జీవితాలకు అర్థం పరమార్థం కలిపిస్తుంది. ప్రేమ – వివర్ణమైన జీవితాన్ని సువర్ణమయ కాంతిరేఖగా మారుస్తుంది. అది హృదయ తాపాన్ని చల్లార్చి, హృదయదాహాన్ని తీరుస్తుంది.
మన జీవితాల్లో చాలామంది మనపై ప్రేమామృతాన్ని కురిపిస్తారు. కాని జాగ్రత్తగా పరి శీలిస్తే – మనల్ని ఎంతగా ప్రేమించే వారున్నా, అది తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. కాని శాశ్వత ఫలితాన్నివ్వదు. వారి నుండి దు:ఖం పూర్తిగా దూరమవదు. ఇది ప్రాపంచికమైన ప్రేమకుండే సహజ లక్షణం. మనల్ని నిజంగా ప్రేమించగలిగి, ద్వేషించినా సరే, ఆదరించ గలిగేవాడు – ఒక్క భగవంతుడు మాత్రమే. కాని ఈ విషయం చాలామంది గ్రహించరు. ఇది అర్థం కావటానికి చాలా వివేకం, విచక్షణ అవసరం. •ష్ట్రవ శీఅశ్రీ• శీఅవ •ష్ట్రశీ తీవ•శ్రీశ్రీ• శ్రీశీఙవ• •శీ• •అ• ••అ శ్రీశీఙవ •శీ• ఱ• శీఅశ్రీ• +శీ• •అ• అశీఅవ వశ్రీ•వ. •వ ఱ• •••ష్ట్రవతీ •అ• ఎశీ•ష్ట్రవతీ తీశీశ్రీశ్రీవ• ఱఅ•శీ శీఅవ.
ఈ విషయం గ్రహించిన నాడు మన సర్వ దు:ఖాలు దూరమవుతాయి. ప్రాపంచిక ప్రేమలో అగుపించునట్లు దు:ఖం దాక్కుని ఉంటుంది. ఎర (••ఱ•) కలిగించే ఆనందంలో ‘చేప’కు దాని వెనక దాగిన ‘గాలం’ కని పించదు. అందుకే ఎలాంటి నిష్కల్మషమైన ప్రాపం చిక ప్రేమ అయినా సరే పూర్తి శాంతినివ్వదు. భగవత్ ప్రేమ ఎల్లపుడూ మనపై కుంభవృష్టిలా కురుస్తూనే ఉంటుంది. కాని, మనమే దాన్ని గ్రహించే స్థితిలో ఉండం. కారణం మన చుట్టూ ఆవరించి ఉండే మాయ. కాని ఒక్కసారి భగవంతుని ప్రేమామృత రసధారలో తడిచిన తర్వాత మనం దేన్నీ యాచించం. అసలు ప్రపంచంలో మనకు కావలసిన వస్తువేదీ లేదన్న విషయాన్ని గ్రహిస్తాం.
ఈ సృష్టి రహస్యాలన్నీ చాలా సూక్ష్మమైనవి కాబట్టి మన మేధస్సుకు అంతగా అర్థం కావు. ‘మాయ’ వలలోంచి జాగ్రత్తగా దాటుకుని, మన అనుభవాల్ని ఆధ్యాత్మిక కోణంలోంచి వడబోస్తూ, వివేకంతో ఒక శాస్త్రవేత్తలా జీవితాన్ని పరిశీ లించాలి. నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రం ఒక్కటి నిజమనిపిస్తూంది. ఈ సర్వచరాచర సృష్టిలో ఎంత అందమైన, ఆనందాన్నిచ్చే సంతృప్తి – శాంతినిచ్చే వ్యక్తియైనా, వస్తువైనా – అదంతా కేవలం మన ‘భ్రమ’ మాత్రమే. ఈ ప్రపంచంలో మనకు ఆనందాన్నిచ్చే శక్తి ఏ వస్తువుకూ, వ్యక్తికీ లేదు. ఇదొక సత్యం. కాని ఆశక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. అదే మాయ. అందుకే – మనకు ఆనందంగా ఉండే వ్యక్తి ఎవరూ కనపడరు. ఒక్క జ్ఞాని తప్ప. ఎంత ధనికుడైనా, విద్యావేత్త అయినా, అధికారియైనా, ఎంతగా కీర్తికాంత కౌగిట్లో ఉన్నా, ఎంతటి ప్రేమించే వాడైనా, ప్రేమింపబడే వాడైనా, అందం ఉన్నా, అవధులు మించే ఐశ్వర్యం ఉన్నా – హృదయాంతరాల్లో దు:ఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంటుంది. కొంత మంది కనపడేలా ఏడుస్తారు. కొంతమంది నవ్వు ముఖానికి పులుముకొని కనపడనట్లు ఏడుస్తారు. ఆకాశంలో లేని ‘నీలిరంగు’ ఉన్నట్లు ఎలా కనపడుతుందో, ప్రాపంచిక విషయాల్లో అలాగే, లేని ఆనందం, ఉన్నట్లు కనపడుతుంది. ఆ లేని వస్తువుకై అందరూ పరుగెత్తి అలసిపోతారు. చివరికి అది లభించదు, అసలు అది లేదు కాబట్టి. ఆకాశంలో నీలిరంగు లేదు. జీవితంలో ఆనందం లేదు. ఆనందం – జీవితానికి అతీ తంగా ఉండే భగవంతునిలో వెతుక్కోవాలి.
ఈ జీవన నాటకంలో పాత్రధారులుగా మన పాత్రను, అది ఎలాంటిదైనా, పాత్రలు కలిగించే రాగబంధాల్లో చిక్కుకోకుండా – నటించాలి. మన అసలు స్వరూపాన్ని మరచిపోకూడదు. నాటకం లోని దు:ఖాలు మనల్ని బాధించకూడదు. నాటకంలో సీత పాత్రను పోషించే వ్యక్తి – తాను ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తుంది. అయినా నిజంగా తాను ఏడవటం లేదు. నాటకంలో శివధను ర్భంగం తర్వాత, పరిణయం జరిగినపుడు – సీత ఆనందిస్తుంది. మనల్ని ఆనందింపజేస్తుంది. అయినా నిజంగా ఆమె ఆనందించటం లేదు. మనం కూడా జీవితంలో అలాగే నడచుకోవాలి. నాటకంలోని రాముడుని కాకుండా అసలు రాముణ్ణి వెతుక్కోవాలి.
అసలు ప్రపంచంలో వాంఛించతగ్గ ఒకే ఒక్క వ్యక్తి ‘భగవంతుడు’. ఆ ప్రేమ’కై ఆరాట పడాలి. పోరాడాలి. దాన్ని సాధించి ఆనం దించాలి.
ఎపుడూ నిర్భయంగా ఉండండి.
ఎల్ల వేళలా భగవంతునిలో అచంచల విశ్వాసం ఉంచండి.
మీకు చేయాలనిపించింది, చేయగలిగి నంతవరకూ చేస్తూ – ఒక ప్రేక్షకునిలా జీవి తంలో అన్ని సంఘటనలను దర్శిస్తూ వెళ్లండి.
ఎపుడూ నవ్విస్తూ, నవ్వుతూ ఉండండి.
మీరు కావాలనుకున్న ఆనందం మీదవుతుంది.
‘గోపి’ గార్కి రవిరాజుగారికి ఉగాది శుభా కాంక్షలు అందజేయండి.
మీ
శ్రీరామ్

Review 5.3.1991, నిజామాబాద్ మిత్రులు విజయకుమార్ గార్కి ఉగాది శుభాకాంక్షలతో ...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top