ప్రభాస్‍ వంద కోట్ల సినిమా

‘బాహుబలి’ తరువాత మళ్లీ బాహుబలి రెండో భాగం షూటింగ్‍లో నిమగ్నమైన ప్రభాస్‍ తన సొంత బ్యానర్‍పై సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బాహుబలి ద్వారా తమిళం, హిందీ భాషల్లోనూ ప్రభాస్‍ మంచి ఇమేజ్‍ సంపాదించుకున్నాడు. దీంతో ఈ రెండు మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని త్రిభాషా చిత్రానికి ప్లాన్‍ చేస్తున్నాడు. ‘రన్‍ రాజా రన్‍’ చిత్ర దర్శకుడు సుజీత్‍ దర్శకత్వంలో ఈ తదుపరి చిత్రం రూపొందనున్నది. సొంత బ్యానర్‍ యూవీ క్రియేషన్స్

‘బాహుబలి’ డైలాగ్‍ రైటర్‍ ఈయనే

బాహుబలి సినిమా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడిగా ఈ సినిమాకు సంబంధించి రాజమౌళికే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరి ఈ సినిమాలో అత్యంత ఆదరణ పొందిన డైలాగ్స్ సంగతేమిటి? వీటిని ఎవరు రాశారు? రైటర్‍ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఇటీవల అందరికీ పెరిగింది. దీనిపై చర్చ జరగడమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా ‘బాహుబలి’ సినిమా డైలాగ్‍ రైటర్‍గా వెలుగులోకి వచ్చిన పేరు-

నవరస నటతిలక

నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీ నటుడు మోహన్‍బాబుకు ‘కళాబంధు’ టీ.సుబ్బరామిరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ‘నవరస నటతిలకం’ బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలంతా హాజరయ్యారు. ఆంధప్రదేశ్‍లోని విశాఖపట్నంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మోహన్‍బాబుకు బిరుదుతో పాటు స్వర్ణకంకణం తొడిగారు. ఈ సందర్భంగా ‘మోహన్‍బాబు నట ప్రస్తానం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.

రామ్‍కు పదేళ్లు

తెలుగు హీరో రామ్‍ తన సినీ కెరీర్‍లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తాజా సినిమా ‘హైపర్‍’ అక్టోబరు 30న విడు దలైంది. ఎనర్జిటిక్‍ స్టార్‍గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‍ తాజాగా కిషోర్‍ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

వాట్సాప్‍ ‘విద్య’

మలయాళీ ముద్దుగుమ్మ విద్యాబాలన్‍ ‘డర్టీపిక్చర్‍’తో గ్లామరస్‍ నటనతో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హ•మ్లీ హీరోయిన్‍గా పేరున్న ఈమె ఇటీవల డెంగ్యూ వ్యాధి బారిన పడింది. ఇపు•డిప్పుడే కోలుకుంటున్న ఆమె సెల్‍ఫోన్‍లోని వాట్సాప్‍ ద్వారా తన మాతృభాష మలయాళం నేర్చుకుంటోంది. మలయాళ కవయిత్రి కమలాదాస్‍ జీవిత చరిత్రతో రూపొందనున్న మలయాళ చిత్రంలో విద్యాబాలన్‍ టైటిల్‍రోల్‍ పోషించనుంది. బాలన్‍ పుట్టింది కేరళలో అయినా విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది. దీంతో

Top