జై బాలయ్య

‘అఖండ’ సినిమాకు ప్యాకప్‌ చెప్పిన బాలకృష్ణ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ టైటిల్‌ పరిశీలనలో ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ కథలో బాలకృష్ణ పవర్‌పుల్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం.

‘సలార్‌’ సరసన మరో హీరోయిన్‌?

ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ ఎంపికైంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్రకు స్కోప్‌ ఉందట. అయితే, ప్రత్యేక గీతం కోసం మాత్రమే ఈ హీరోయిన్‌ అవసరమట. ఇప్పటికే ఈ పాత్ర కోసం శ్రీనిధి శెట్టి, శ్రద్ధాకపూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే, మరో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యముందని, అందుకే

శ్రీవల్లితో పుష్పరాజ్‌ ఆట..పాట

అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రానున్న ‘పుష్ప’ రిలీజ్‌కు ముందే హైప్స్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇటీవలే ‘దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ అదరగొట్టిన అల్లు అర్జున్‌.. తాజాగా ‘ఎవరికీ ఎప్పుడూ తలవంచని నేను.. నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను’ అంటూ పాటందుకున్నాడు. ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ పాట విడుదల కాగా, నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రబోస్‌

బ్యాచిలర్‌ కుర్రోడు రెడీ

అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ 2021, అక్టోబర్‌ 8న విడుదలకు సిద్ధమవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అఖిల్‌ ఏడు గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఫార్మల్‌ లుక్‌ నుంచి మోడ్రన్‌ వరకు స్టిల్స్‌లో కనిపించాడు. ఈ ఏడు గెటప్స్‌లో అతను చేసే హంగామా చూడాలంటే అక్టోబర్‌ 8 వరకు ఆగాల్సిందే.

డిసెంబర్‌లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’

నాచురల్‌ స్టార్‌ నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న చిత్రం` శ్యామ్‌ సింగరాయ్‌. ఇందులో శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు పాత్రలను నాని పోషిస్తున్నాడు. దసరా సందర్భంగా వాసు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. కాగా, నాని హీరోగా ‘దసరా’ పేరుతో మరో చిత్రం రానుంది. విజయదశమి సందర్భంగా

Top