ఇక విడుదలే తరువాయి!

మెగాస్టార్‍ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే హైదరాబాద్‍లో చిరంజీవి, బాలీవుడ్‍ తార మౌనీరాయ్‍పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. నృత్య దర్శకుడు గణేశ్‍ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనీరాయ్‍తో పాటు వంద మంది డ్యాన్సర్లతో ఈ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. దీంతో సినిమా పూర్తయినట్టు చిత్ర యూనిట్‍ తెలిపింది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవి సరసన త్రిష,

మనం చూస్తున్నది కాదు..

ఏం చేస్తున్నామో అదే నిజమైన ప్రపంచం! కాస్త సమయం దొరికితేనే కాదు.. పనులు మానుకుని మరీ నేటి తరం సోషల్‍ మీడియాలో తలమునకలైపోతోంది. మొబైల్‍పై రీల్స్, షార్టస్, వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను అదేపనిగా స్క్రోల్‍ చేయడం ఓ వ్యసనంగా మారిపోయింది. ఇది వారూ వీరూ అని కాదు.. అందరికీ అదేపనిగా మారిపోయింది. ఈ ‘సోషల్‍’ వ్యసనంపై కథానాయిక శ్రుతిహాసన్‍ కొన్ని మంచి విషయాలు చెప్పింది. నేటి తరం అందరూ వినాల్సిన

జీవిత పాఠాల ‘కోట’

తెలుగు సినిమాకు పెట్టని‘కోట’.. కోట శ్రీనివాసరావు. తెలుగుతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ, బాలీవుడ్‍లోనూ తనదైన శైలిలో నటించి, మెప్పించిన లెజండరీ నటుడాయన. ఇటీవలే కన్నుమూసిన ఆయన వెండితెరపై హీరోగా తప్ప మిగతా అన్ని పాత్రల్లోనూ మెప్పించి.. మెరిశారు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకున్నట్టు నటుడిగా ఆయా పాత్రల్లో ఇమిడిపోయి దానికి ప్రాణం పోయడంలో సిద్ధహస్తుడు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా పరిశ్రమలో నలభై

షూట్‍ ఎట్‍ హైదరాబాద్‍

ఏదైనా సినిమా ప్రారంభమైందంటే.. కొన్ని సన్నివేశాలో.. లేదా కొంత షూటింగ్‍ పార్టో విదేశాల్లో జరగడం రివాజు. ఫలానా చిత్ర యూనిట్‍ ఫలానా దేశానికి షూటింగ్‍ నిమిత్తం వెళ్తుందనేది చాలా కామన్‍. అయితే ఇప్పుడు లోకల్‍గానే చాలా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్‍ వేదికగా భారీ సెట్స్ వేసి షూట్‍ చేస్తున్నారు. రాజధాని పరిసరాల్లో షూటింగ్‍ జరుపుకుంటున్న కొన్ని చిత్రాల విశేషాలివీ.. మెగాస్టార్‍ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ కోసం హైదరాబాద్‍ సమీపంలోని

ఇద్దరా? ఇద్దరిలో ఒకరా?

మహేశ్‍బాబు, రాజమౌళి సినిమాలో స్టార్‍ కాంబినేషన్స్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓ కీలక పాత్రకు ప్రియాంకచోప్రాను ఎంపిక చేసిన చిత్ర యూనిట్‍.. తాజాగా పృథ్వీరాజ్‍ సుకుమార్‍తో చర్చలు ప్రారంభించింది. ఇంకో కీలక పాత్ర కోసం బాలీవుడ్‍ నటుడు నానాపటేకర్‍ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ ఉంటారా? ఇద్దరిలో ఒకరేనా అనేది ఆసక్తి కలిగిస్తోంది.

Top