తెలుగు వెండితెరపై అందం, అభినయం కలగలసిన మరో సంచలనం.. రుక్మిణీ వసంత్. తెలుగునాట బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా ‘శాండల్‌వుడ్’ సోయగాలు తళుకులీనుతున్నాయి. పూజాహెగ్డే, రష్మిక.. ఈ వరుసలో మరో కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంటోంది. ‘కాంతార చాప్టర్-1’ విజయంతో, ఆ సినిమాలో మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ కన్నడ కస్తూరి ఇటీవలే శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో తళుక్కుమంది. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ కాంబోలో రానున్న చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్-1’ సక్సెస్‌తో మంచి జోరుమీదున్న రుక్మిణీ ఏం చెబుతోందంటే..
నా మొదటి సినిమా..
నా మొదటి సినిమా ‘బీర్బల్’. థ్రిల్లర్‌గా రూపొందిన ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘సప్తసాగర దాచే ఎల్లో’ రెండు భాగాల్లోనూ నటించడం నా కెరీర్‌కు చాలా కలిసొచ్చింది. ఇదే సినిమా ‘సప్తసాగరాలు దాటి..’ పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తద్వారా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాను. ఈ సినిమాలోని ప్రియ పాత్ర ద్వారా నన్ను నేను నటిగా నిరూపించుకోగలిగాను. రక్షిత్‌శెట్టి డెడికేషన్ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది.
లైబ్రరీ ఎక్కడుందా అని వెతుకుతా..
షూటింగ్స్ కోసం ఏ ఊరు వెళ్లినా మొదట లైబ్రరీ ఎక్కడుందో తెలుసుకుంటాను. పుస్తకాలు చదవడం అంటే అంత ఇష్టం. కన్నడ సినిమా ‘బానదరియల్లి’ కోసం వాటర్స్పోర్టస్ నేర్చుకున్నా. ఇదే సినిమా కోసం సీ సర్ఫింగ్, స్విమ్మింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నా.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు..
ప్రస్తుతం కన్నడలో ‘బఘీరా’ చేస్తున్నాను. ఇటీవలే రిషభ్‌శెట్టి కాంబినేషన్లో ‘కాంతారా చాప్టర్-1’ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నాకు కూడా మంచి ఇమేజ్ ఏర్పడింది. ప్రస్తుతం తమిళం, తెలుగులోనూ పలు కథలు వింటున్నా. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను స్ట్రెయిట్ చిత్రం ద్వారా నేరుగా పలకరించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. భాష ఏదైనా వైవిధ్యమైన పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం.
డ్యాన్స్, థియేటర్ ఆర్టస్..
చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్, థియేటర్ ఆర్టస్ అంటే ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే చదువు పూర్తవగానే రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్టస్ (ఆర్ఏడీఏ)లో నటనలో శిక్షణ పొందాను. ఈ శిక్షణ నన్నెంతగానో ప్రభావితం చేసింది. నా నటనా సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడింది.
నేను, నా కుటుంబం..
మాది బెంగళూరు. మా నాన్న అశోకచక్ర అవార్డు అందుకున్న మొదటి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన 2007లో మార్టిర్ అయ్యారు. నాన్న దగ్గర దేశభక్తి గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. అమ్మ స్మిత. నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ అన్నీ తానై అండగా ఉంటుంది.
టూర్లు.. ట్రావెలింగ్
డ్యాన్స్ చేయడం, బుక్స్ చదవడం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. బంకమన్నుతో రకరకాల పాత్రలు తయారు చేస్తుంటాను. ప్రకృతిని అమితంగా ప్రేమిస్తా. చాయ్ బిస్కట్ నా ఫేవరెట్. పురాతన కట్టడాలను సందర్శించడం, కుటుంబసభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం ఇష్టం.
రోజూ యోగా..
రోజూ క్రమం తప్పకుండా యోగా, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. హెల్దీడైట్ ఫాలో అవుతాను. శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతాను. నా సౌందర్య రహస్యం కూడా అదే. ఐస్‌క్రీమ్, ఇడ్లీ సాంబార్ నా ఫేవరెట్ ఫుడ్. చీరలంటే చాలా ఇష్టం.























































































































































































































































Review సిరిచందనపు చెక్కలాంటి భామ.