ఢమ ఢమ ఢం అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు..
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‍లో చందూ మొండేటి దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ‘తండేల్’ నుంచి ఇటీవలే ఓ శివశక్తి గీతం విడుదలైంది. ‘నమో నమ:శివాయ.. ఢమ ఢమ ఢం అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు.. అష్టదిక్కులు అదిరేట్టు తాండవేశ్వరా..’ అంటూ సాగే ఈ గీతం అభిమానులను అలరిస్తోంది. జొన్నవిత్తుల సాహిత్యానికి దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చగా అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటను విజువల్‍గా తెరకెక్కించిన తీరు, ఇందులో




