శ్రీవల్లితో పుష్పరాజ్‌ ఆట..పాట

అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రానున్న ‘పుష్ప’ రిలీజ్‌కు ముందే హైప్స్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇటీవలే ‘దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ అదరగొట్టిన అల్లు అర్జున్‌.. తాజాగా ‘ఎవరికీ ఎప్పుడూ తలవంచని నేను.. నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను’ అంటూ పాటందుకున్నాడు. ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ పాట విడుదల కాగా, నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రబోస్‌

బ్యాచిలర్‌ కుర్రోడు రెడీ

అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ 2021, అక్టోబర్‌ 8న విడుదలకు సిద్ధమవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అఖిల్‌ ఏడు గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఫార్మల్‌ లుక్‌ నుంచి మోడ్రన్‌ వరకు స్టిల్స్‌లో కనిపించాడు. ఈ ఏడు గెటప్స్‌లో అతను చేసే హంగామా చూడాలంటే అక్టోబర్‌ 8 వరకు ఆగాల్సిందే.

డిసెంబర్‌లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’

నాచురల్‌ స్టార్‌ నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న చిత్రం` శ్యామ్‌ సింగరాయ్‌. ఇందులో శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు పాత్రలను నాని పోషిస్తున్నాడు. దసరా సందర్భంగా వాసు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. కాగా, నాని హీరోగా ‘దసరా’ పేరుతో మరో చిత్రం రానుంది. విజయదశమి సందర్భంగా

‘భోళా శంకర్‌’ షురూ

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణను పట్టాలెక్కించేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళయాలం సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మెహన్‌రాజ్‌ దర్శకుడు. ఇదిలా ఉండగా, ‘భోళా శంకర్‌’ సినిమాను సైతం అదే సమయంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హిట్‌

నీలాంబరివే..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పూజాహెగ్డే హవా నడుస్తోంది. త్వరలో వరుసగా విడుదల కానున్న అన్ని భారీ బడ్జెట్‌ చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది. ఒకపక్క తెలుగుతో పాటు తమిళం, కన్నడంలోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న పూజా మరోపక్క బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. దీంతో డిమాండ్‌ ఉన్న హీరోయిన్‌గా ఆమె అవతరించింది. ఇటీవలే పుట్టిన రోజు జరుపుకున్న ఆమె.. తన కొత్త సినిమాల గురించి చెప్పుకొచ్చింది. అలాగే వివిధ సినిమాల్లోని

Top